తెలంగాణలో 45వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: మరో ఆరుగురు మృతి, జిల్లాల వారీగా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Recommended Video

    AAP Telangana Convenor Vishnu Interview Part - 2 తెలంగాణలో కరోనా పెరగటానికి కారణం TRS నే !

    ఇప్పటి వరకు కరోనా నుంచి 32,438 మంది కోలుకున్నారు. 12,224 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం కరోనా బారినపడి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 415కు చేరింది.

     1296 new coronavirus cases recorded in telangana: 6 more deaths

    16 ప్రభుత్వ ల్యాబ్స్, 23 ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆదివారం 12,519 నమూనాలను పరీక్షించగా 1296 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 557, వరంగల్ అర్బన్ 117, రంగారెడ్డి 111, మేడ్చల్ 87, కామారెడ్డి 67, వరంగల్ రూరల్ 41 కేసులు నమోదయ్యాయి.

    సంగారెడ్డిలో 28, ఖమ్మంలో 5, నిర్మల్ 1, కరీంనగర్ 27, జగిత్యాల 11, యాదాద్రి భువనగిరి 15, మహబూబాబాద్ 21, పెద్దపల్లి 29, మెదక్ 29, మహబూబ్ నగర్ 6, మంచిర్యాల 1, నల్గొండ 26, రాజన్న సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 15, ఆసిఫాబాద్ 1, వికారాబాద్ 1, నాగర్ కర్నూల్ 13, జనగామ 5, నిజామాబాద్ 24, ములుగు 2, వనపర్తి 7, సిద్దిపేట 10, సూర్యాపేట్ 16, జోగులాంబ గద్వాల్ 4 కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+