Free Bus: మహిళలకు శుభవార్త.. వారి కోసం కొత్తగా 1325 బస్సులు..!
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. దీంతో మహిళలు భారీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. పెరుగుతోన్న రద్దీకి అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జూన్ నాటికి 1325 కొత్త బస్సులను దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ 1325 బస్సుల్లో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి, రాజధాని బస్సులున్నట్లు తెలుస్తోంది. ఈ 1325 బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన 100 బస్సుల్లో 90 ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఉపయోగించనున్నారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా ఆర్టీసీ తీసుకరాబోతోంది. 11 మీటర్ల పొడువుగల ఈ ఏసీ బస్సుల్లో.. 36 సీట్ల సామర్థ్యం ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్ సైట్ wwww.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తో పాటు టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 90 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయ్యొచ్చు. అయితే అవసరం ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని చెబుతున్నారు. అనవసరంగా ప్రయాణం చేస్తే మిగతా వారికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొంటున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
బాసర ఆలయానికి మహర్దశ: రేపే..: తిరుమల మోడల్ -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications