తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, టెస్టులు కూడా: 12 జిల్లాల్లో కొత్త కేసులు సున్నా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు తాజాగా, భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 150 కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. తాజాగా 26,842 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 135 మందికి కరోనా సోకినట్లు తేలింది. అయితే, కరోనా టెస్టులు కూడా భారీగా తగ్గడం గమనార్హం. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 135 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,70,274కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3947గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా, మరో 870 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,377కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3950 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 00, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 64. జగిత్యాలలో 03, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 09, ఖమ్మంలో 08, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 03, మంచిర్యాలలో 01, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 04, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 04, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 00, పెద్దపల్లిలో 01, రాజన్న సిరిసిల్లలో 01, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 03, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 00, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 01, వరంగల్ అర్బన్‌లో 03, యాదాద్రి భువనగిరిలో 01 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 12 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.40,158 నమూనాలను పరీక్షించగా.. 15,906 మందికి కరోనా సోకినట్లు తేలింది. శనివారం 561 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4,54,269కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 16,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.35 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.17 శాతానికి పెరిగింది. రికవరీ పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో 1,72,594 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గింది. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో శనివారం 77,40,676 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకున్నవారి సంఖ్య 1.02 కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications