రేవంత్‌రెడ్డి వెంట వీరే: టిడిపికి షాకిచ్చారు, బలబలాలివే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వెంట టిడిపి కొందరు ముఖ్య నేతలు టిడిపిని వీడనున్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశానికి హజరయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కొందరు ముఖ్య నేతలు కూడ టిడిపిని వీడి రేవంత్‌వెంట వెళ్ళాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే రేవంత్‌ వెంట వెళ్ళే టిడిపి నేతల బలబలాలను ఒకసారి పరిశీలిద్దాం.

రేవంత్ ఎపిసోడ్: మారుతున్న పాలమూరు రాజకీయ చిత్రం, తమ్ముళ్ళ డుమ్మా

రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.అయితే రేవంత్‌రెడ్డి తన వెంట కొందరు ముఖ్యమైన టిడిపి నేతలను కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేలా వ్యూహం రూపొందించారు. ఈ వ్యూహం ప్రకారంగా సోమవారం నాడు తన నివాసంలో నిర్వహించిన సమావేశానికి కొందరు టిడిపి నేతలు హజరయ్యారు.

రంగంలోకి కుంతియా: రేవంత్‌ చేరికకు అభ్యంతరం లేదు: డికెఅరుణ

తనతో పాటు సుమారు 20 మందికిపైగా టిక్కెట్లు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎదుట డిమాండ్లు పెట్టారని సమాచారం.ఈ డిమాండ్ల మేరకు రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి కూడ సానుకూలమైన స్పందన ఉందని సమాచారం. ఈ తరుణంలో కొందరు కీలకమైన టిడిపి నేతలు రేవంత్ వెంట కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు.

ట్విస్ట్ ఇచ్చిన సీతక్క

ట్విస్ట్ ఇచ్చిన సీతక్క

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీతక్క ట్విస్ట్ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరిన సమయంలోనే సీతక్క టిడిపిని వీడుతారని ప్రచారం సాగింది. అయితే ఆమె టిడిపిలోనే కొనసాగారు. కానీ, అనుహ్యంగా రేవంత్‌రెడ్డి వెంట నడవాలని ఆమె నిర్ణయం తీసుకొన్నారు. ములుగు నియోజకవర్గం నుండి మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చందూలాల్ గతంలో టిడిపిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన టిఆర్ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో సీతక్క ములుగు నుండి టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2014 ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థిగా పోటీచేసినా ఆమె చందూలాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గం నుండి 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీరయ్య పోటీచేసి విజయం సాధించారు. అయితే వీరయ్యను కాదని సీతక్కకు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు లభిస్తోందా అనే చర్చ కూడ లేకపోలేదు.అయితే వీరయ్య కంటే సీతక్క మెరుగైన అభ్యర్థి అనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో టిడిపి నేతలు పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. అయితే సీతక్క మినహ ఇద్దరు కూడ రేవంత్ సమావేశానికి హజరుకాలేదు. నర్సంపేట నుండి రేవూరి ప్రకాష్‌రెడ్డి, భూపాలపల్లి నుండి గండ్ర సత్యనారాయణరావులు టిడిపిలోనే ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. అయితే మంత్రి చందూలాల్ అనారోగ్య సమస్యలు టిఆర్ఎస్‌కు కొంత ఇబ్బంది కల్గించే అవకాశాలున్నాయి. అయితే రాజకీయ ప్రత్యర్థులకు ఇది కొంత కలిసివచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.వీరయ్యకు టిక్కెట్టు దక్కకపోతే సీతక్కకు ఏ మేరకు సహకరిస్తారోననేది ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది.

 బాబుకు షాకిచ్చిన విజయరమణరావు

బాబుకు షాకిచ్చిన విజయరమణరావు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు దక్కకపోవడంతో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి విజయరమణరావు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టిడిపికి అసోసియేట్‌గా కొనసాగారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన టిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి చేతిలో విజయరమణరావు ఓటమిపాలయ్యారు.విజయరమణరావును టిఆర్ఎస్‌లో రావాలని అధికార పార్టీ నుండి అనేక ఒత్తిడులు వచ్చినా ఆయన మాత్రం టిడిపిని వీడలేదు. మంత్రి కెటిఆర్‌కు విజయరమణరావు సతీమణికి సన్నిహిత బంధుత్వం ఉంది. అయినా కానీ, విజయరమణరావు టిడిపిని వీడలేదు. అయితే విజయరమణరావు మాత్రం రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

రేవంత్‌ వెంట కంచర్ల భూపాల్‌రెడ్డి

రేవంత్‌ వెంట కంచర్ల భూపాల్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి వెంట నడవాలని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన కంచర్ల భూపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. బాబుతో పార్టీ నేతల సమావేశ వివరాలను మీడియాకు లీక్ చేశారని ఆదివారం నాడే కంచర్ల భూపాల్‌రెడ్డికి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే కంచర్ల భూపాల్‌రెడ్డి కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో తనకు సరైన ప్రాతినిథ్యం లేదనే విషయమై కంచర్ల భూపాల్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మోత్కుపల్లి నర్సింహ్ములు వైఖరి రాజకీయంగా తనకు నష్టం చేస్తోందని కంచర్ల భూపాల్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన రేవంత్‌ వెంట నడవాలని నిర్ణయం తీసుకొన్నారు.2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కంచర్ల భూపాల్‌రెడ్డి బరిలో దిగారు. ఈ స్థానంలో బిజెపికి టిక్కెట్టు దక్కింది. దీంతో కంచర్ల భూపాల్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపు వాకిట్లోకి వచ్చి ఓటమిపాలయ్యారు. కంచర్ల భూపాల్‌రెడ్డిపైనే కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. టిఆర్ఎస్ నేతలు కూడ భూపాల్‌రెడ్డిని ఆహ్వనిస్తున్నారు. అయితే నల్గొండ స్థానం నుండి గత ఎన్నికల్లో దుబ్బాక నర్సింహ్మరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగాడు. అయితే సుఖేందర్‌రెడ్డి టిఆర్ఎస్‌లో ఉన్నారు. ఈ కారణంగా టిఆర్ఎస్‌ను ఎంచుకోలేదు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని భూపాల్‌రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వరు.1999 నుండి ఈ స్థానం నుండి వెంకట్‌రెడ్డి విజయం సాధిస్తున్నారు.భూపాల్‌రెడ్డికి నల్గొండ అసెంబ్లీ టిక్కెట్టు మాత్రం దక్కకపోవచ్చు. తనకు రాజకీయంగా పార్టీలో ఇబ్బంది కలుగుతోందనే భావనతోనే భూపాల్‌రెడ్డి టిడిపిని వీడాలని భావించారంటున్నారు.

 పటేల్ రమేష్‌రెడ్డి షాక్

పటేల్ రమేష్‌రెడ్డి షాక్

ఉమ్మడి నల్లొండ జిల్లాలోని సూర్యాపేట అసెంబ్లీ స్థానాన్ని గత ఎన్నికల్లో బిజెపికి కేటాయించింది టిడిపి. ఈ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీగా ఉన్న పటేల్ రమేష్‌రెడ్డి రేవంత్‌రెడ్డి వెంట నడవాలని నిర్ణయం తీసుకొన్నారు. పటేల్ రమేష్‌రెడ్డి మోత్కుపల్లి నర్సింహ్ములు వర్గంగా ముద్రపడ్డారు. అనుహ్యంగా మోత్కుపల్లికి షాకిస్తూ పటేల్ రమేష్‌రెడ్డి రేవంత్‌ వెంట వెళ్ళాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఈ నియోజకర్గం నుండి దామోదర్‌రెడ్డి పోటీచేసి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి జగదీష్‌రెడ్డి చేతిలో దామోదర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు.అయితే బిజెపి టిక్కెట్టు సంకినేని వెంకటేశ్వర్‌రావు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆయనకు బిజెపి టిక్కెట్టు దక్కలేదు.స్వతంత్ర అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్‌రావు బరిలోకి దిగారు.సంకినేనిపైనే జగదీష్‌రెడ్డి ఓటమిపాలయ్యారు.దామోదర్‌రెడ్డిని కాదని పటేల్ రమేష్‌రెడ్డికి టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 రేవంత్‌ వెంట రాజారామ్

రేవంత్‌ వెంట రాజారామ్

ఓయూ విద్యార్థి జెఎసి నేతగా ఉన్న రాజారామ్ యాదవ్ గత ఎన్నికల్లో ఆర్మూర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రేవంత్ వెంట రాజారామ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే రాజారామ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కే అవకాశం లేకపోలేదు.టిడిపి నుండి పోటీ చేసేందుకు కొత్త నేతను వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.సతీష్‌మాదిగ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్థన్, మాజీ ఎమ్మెల్యే బాబురావు , గంగాధర్‌లు కూడ రేవంత్‌వెంట నడవాలని నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Key leaders around 15 members from TDP joined with Revanth Reddy.They will join in Congress party with Revanth Reddy soon. TTDP leaders leaders attended meeting held at Revanth reddy house on Monday.
Please Wait while comments are loading...