వేసవి వచ్చిందొచ్ .. ఒంటిపూట బడులు తెచ్చిందొచ్ ...
హైదరాబాద్ : ఎండకాలం వచ్చిందంటే చాలు .. ఆ మజానే వేరు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు సమ్మర్ హాలీడేస్ లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. దాదాపు రెండునెలలు అమ్మమ్మ, నానమ్మ అని ఊళ్లో చుట్టి వస్తారు. ఇప్పటివరకు ఓకే .. దాని కన్నా ముందే బడి పిల్లలకు సంతోషాన్నిచ్చే ఉంది. అదే ఒంటిపూట బడులు.

15 నుంచి ఒంటిపూట బడులు
ఒంటిపూట బడులపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్ నిర్వహిస్తామని వెల్లడిచింది. దీంతో బడికెళ్లే ఆ బుడి బుడి అడుగుల చిన్నారుల మనసుల్లో హాఫ్ డే స్కూలా అని తెగ సంబరపడిపోతున్నారు. ఉదయం 7 గంటలకు ఇంటినుంచి స్కూల్ కు వెళ్లి .. మధ్యాహ్నం 1 గంట వరకే ఇంట్లో ఉంటారు. హాఫ్ డే స్కూల్ వల్ల సమయమే తేలిదని మురిసిపోతున్నారు.

దాదాపు నెలరోజులు హాఫ్ డే స్కూల్
15వ తేదీ నుంచి వచ్చే నెల 12 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తారు. సమయానికి అనుగుణంగా టైం టేబుల్ నిర్ధారిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే సెలబస్ పూర్తవుతున్నందున ... రివిజన్ కాబట్టి క్లాసుల కోసం ఇబ్బంది ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.

అదనపు తరగతులు నిర్వహిస్తే చర్యలు
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ర్యాంకుల కోసం అదనపు తరగతులు నిర్వహిస్తుంటాయి. వాటికి ముకుతాడు వేసేలా .. కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ప్రైవేట్ స్కూళ్లలో అదనపు తరగతులు నిర్వహిస్తే ... తమకు సమాచారం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కోరింది.












Click it and Unblock the Notifications