ప్రేమ పేరుతో అమ్మాయిపై ఒకడు పలుమార్లు రేప్, మరొకడు హోటల్‌కు తీసికెళ్లి....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాదులోని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. కర్నాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌(21) కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మంద మల్లమ్మ చౌరస్తాలోని జహంగీర్‌ఖాన్‌కు చెందిన వెల్డింగ్‌ షాప్‌లో పని చేస్తూ ఉండేవాడు. న్యూమారుతీనగర్‌లోని జహంగీర్‌ ఇంట్లో నివాసం ఉంటూ వచ్చాడు.

తొమ్మిది నెలల క్రితం అక్కడే నివసించే పదిహేనేళ్ల బాలికను పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో లోబరచుకుని తన గదికి తీసుకొచ్చి చాలాసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన జహంగీర్‌ దాన్ని ఆసరా చేసుకుని 'మీరు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ బాలికను బెదిరించి అతడు కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

15-year-old girl assaulted, police arrests 2 suspects

బాలికకు బురఖా తొడిగి, మలక్‌పేటలోని ఓ హోటల్‌లో రూమ్‌కు తీసుకెళ్లి, అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తన చెల్లెలు అని, వైద్యం కోసం తీసుకువచ్చామని హోటల్‌ వారిని నమ్మించి గది తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.

అయితే ఎన్ని సార్లు అడిగినా ఫొటోలు, వీడియోలు ఇవ్వకపోవడంతో బాధితురాలు మంగళవారం విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి స్విఫ్ట్‌కారు, బురఖా, ఒక మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 15 year old girl was raped by two people at Meerpet. The victim, a Class IX student, was close to one of the suspects, Md. Usman, 20. The second suspect, Md. Jahangir, 34, allegedly took the victim to a lodge and raped her after blackmailing her saying that he has video clips of intimate moments of her and Usman that he would upload on social media
Please Wait while comments are loading...