బాలికపై కజిన్ పలుమార్లు రేప్: ప్రోత్సహించిన తాత, స్కూల్ టీచర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డబ్బుల కోసం ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఆ డబ్బుల కోసమే అతనికి తాత, ఓ పాఠశాల ఉపాధ్యాయుడు సహకరించారు. నల్లగొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై పాతికేళ్ల ఆమె కజిన్ గత నెలలో పలుమార్లు అత్యాచారం చేశాడు.

తాత ఇంట్లో ఆమె దౌర్జన్యానికి గురైంది. పోలీసులు హైదరాబాదుకు చెందిన ఆమె కజిన్ జి. సాయిపై, ఆమె తాత అంజయ్యపై, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేందర్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. కిందిశేషాయ్ గ్రామానికి చెందిన బాలిక దిండిలోని ఓ కాటన్ మిల్లులో హెల్పర్‌గా పనిచేస్తుండేది.

ఏడు నెలల క్రితం ఆమెకు పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నించింది. పెళ్లి వద్దంటూ అమ్మాయి పారిపోయి శిశు సంక్షేమ శాఖ ఆశ్రయం పొందింది. ఆ తర్వాత అమ్మాయిని తవక్లపూర్ గ్రామంలో నివసిస్తున్న ఆమె తాతకు అప్పగించారు. అమ్మాయి పేరు మీద ప్రభుత్వాధికారులు లక్షన్నర రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్‌బుక్ తాతకు ఇచ్చారు. అమ్మాయి 2016 ఏప్రిల్ వరకు పాఠశాలకు వెళ్లింది.

15-year-old raped by cousin at her grandpa’s house

ఈ విద్యాసంవత్సరం అమ్మాయి బడి మానేయదంతో తల్లి అంజయ్యకు లీగల్ నోటీసు ఇచ్చింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక అంజయ్య బాలికను తల్లి చెంతకు పంపించాడు. ఇంటికి వచ్చిన కూతురు తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ తల్లికి చెప్పింది.

దాంతో కూతుర్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. తన తాత ఇంట్లో కజిన్ సాయి తనపై అత్యాచారం చేశాడని అమ్మాయి చెప్పింది. నెల క్రితం అమ్మాయి టీవీ చూస్తున్న సమయంలో సాయి ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ సమయంలో అంజయ్య బయట పడుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

తన కూతురిపై అత్యాచారం చేయడానికి సాయిని అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయుడు ప్రోత్సహించారని, దానివల్ల వారిద్దరికి పెళ్లి జరుగుతుందని భావించారని, దాంతో డబ్బులు కాజేయవచ్చునని అనుకున్నారని అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. సాయిని అరెస్టు చేయడానికి పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 15-year-old girl was allegedly raped by her 25-year-old cousin several times last month in Nalgonda. The girl was staying with her grandfather when the incident happened. When she went to her mother and complained of pain, her mother asked her about the incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి