హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో కిడ్నాప్: బాపట్లలో రైలు నుంచి దూకేసి ఎస్కేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో అపహరణకు గురైన 15 ఏళ్ల బాలుడు ప్రకాశం జిల్లా బాపట్లలో తేలాడు. కదులుతున్న రైలు నుంచి అకస్మాత్తుగా ప్రకాశం జిల్లా బాపట్ల రైల్వే ఫ్లాట్‌ఫామ్ పైకి దాకేసి అతను కిడ్నాపర్లను నుంచి తప్పించుకున్నాడు. బాపట్ల రైల్వే స్టేషన్లో రైలు నుంచి దూకేసిన బాలుడు ఎవరా అని స్థానిక పోలీసులు ఆరా తీశారు.

దీంతో అతను హైదరాబాదులోని పాతబస్తీలో కిడ్నాపైన 15 ఏళ్ల బాలుడు శబరీష్ అని తేలింది. ఇతడు నగరంలోని పాతబస్తీకి చెందిన బిజెపి నేత పొన్న వెంకట రమణ కుమారుడు. ఇతడిని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

ఆదివారం రాత్రి శబరీష్‌ను ఇద్దరు వ్యక్తులు రైలు ఎక్కిస్తుండగా చూసినట్లు ఓ మహిళ తెలిపింది. శాలిబండ పోలీసులు రంగంలోకి దిగారు. తనకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశారని శబరీష్ పోలీసులకు తెలిపాడు. కాగా విషయాన్ని బాపట్ల పోలీసులు హైదరాబాద్ పోలీసులకు చేరవేశారు. శబరీష్ చైతన్య టెక్నో స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

15 years old Hyderabd boy escaped from kidnappers

పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థి పొన్నా శబరీశ్‌ను ఆదివారం సాయంత్రం కొందరు దుండగులు అపహరించి ఎంఎంటిఎస్‌లో సికిం ద్రాబాద్‌కు తీసుకువెళ్లారు. వారి నుంచి తప్పించు కునే ప్రయత్నంలో శబరీశ్ విశాఖపట్నం వెళ్లే రైలు ఎక్కి సోమవారం విశాఖపట్నం చేరుకున్నాడు. అక్కడి నుంచి తిరుపతి వెళ్లి హైదరాబాద్ చేరుకోవాలనే ఉద్దేశంతో బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు.

సోమవారం రాత్రి బాపట్ల స్టేషన్‌లో కదులుతున్న రైల్లోంచి దూకేసిన శబరీశ్‌ను గమనించిన ఆర్‌పిఎఫ్ ఎస్ఐ, ఎఎస్ఐలు వీర బాబు, సుధాకర్‌రావు విషయాన్ని ఆరా తీశారు. దీనితో జరిగిన విషయాన్ని బాలుడు పోలీసులకు వివరించాడు. అనంతరం బాలుడిని స్టేషన్‌కు తీసు కువెళ్లిన పోలీసులు విద్యార్థి తల్లిదండ్రులకు సమా చారం అందించారు.

మంగళవారం బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలియ జేశారు. అంతకు ముందు విద్యార్థి అపహరణకు గురైనట్లు శాలిబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, విద్యార్థి తండ్రి వెంకట రమణ హైదరాబాద్ బిజెపి నగర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

English summary
15 years old boy from Hyderabad Shabareesh escaped from the kidnapers at Bapatla in Prakasam district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X