1500 ఆశా వర్కర్ల నియామంకపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశా వర్కర్ పోస్టులకు ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశా వర్కర్ పోస్టులకు ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు ఈ మేరకు వెల్లడించారు.
బస్తీ దవాఖానాలతో ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందుతోందన్నారు మంత్రి హరీశ్ రావు. బస్తీల సుస్తి పోగొట్టేందుకు సీఎం కేసీఆర్.. బస్తీ దవాఖానాలు ప్రారంభించి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు.రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశామన్నారు.

ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు చేస్తున్నామని, వీటిని త్వరలో 134 రకాల పరీక్షలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. 158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆదివారం కాకుండా శనివారం బస్తీ దవాఖానాలకు సెలవు ఇస్తున్నామని చెప్పారు.
బస్తి దవాఖానాలు స్థానికంగా సేవలందిస్తుండటంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లాంటి పెద్ద ఆస్పత్రుల్లో ఓపి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఉస్మానియాలో 5 లక్షల మంది (60%), గాంధీ 2019లో 3.7 లక్షల మంది (56%), నీలోఫర్ 5.3 లక్షలు (44%), ఫీవర్ ఆసుపత్రిలో లక్ష 12 వేలు (72%) ఓపీ తగ్గిందని, అదే సమయంలో శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి హరీశ్ రావు వివరించారు.
Live: Speaking at Telangana Legislative Assembly https://t.co/QyAFdMmuv5
— Harish Rao Thanneeru (@BRSHarish) February 12, 2023
అంతేగాక, సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు తక్షణ వైద్యం అందించడంపై పెద్దాసుపత్రుల్లో సాధ్యం అవుతోందన్నారు. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖాన సేవలు పొందారని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలలో అన్ని జిల్లాలో న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తామని, బస్తీ దవాఖానలో త్వరలో బయోమెట్రిక్ విధానం కూడా ప్రవేశ పెడతామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications