క్షుద్రబాబాలు: పిల్లల చేతులూ కాళ్లూ కట్టేసి ఇనుప చీలలతో... (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో దక్షిణ మండలం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు క్షుద్రపూజలు చేసే 16 మందిని కార్డన్ సెర్చ్ నిర్వహించి అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు దొంగ బాబాలు ఉన్నారు. తమ వద్ద మానవాతీత శక్తులు ఉన్నాయంటూ అల్లరి చేసే పిల్లలను వీరు చిత్ర హింసలు పెడుతూ వస్తున్నారు.

కాలా జాదు, సైతాన్‌ ఆవహించిందంటూ భయపెడుతూ వస్తున్నారు. తమ వద్దకు వచ్చిన వారిని నక్షాబందీ, క్షుద్రపూజల పేరుతో చిత్రహింసలకు గురి చేశారు. పిల్లలు మారాం చేస్తున్నారంటూ తీసుకొస్తే మరింత వికృతంగా ప్రవర్తించేవారు.

మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వి. సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. చిన్నారులను హింసించిన వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. హైదరాబాదు పాతబస్తీ పరిధిలో పిల్లలు అల్లరి చేసినా, వారికి జ్వరం వచ్చినా క్షుద్రపూజలు చేసేవారిని ఆశ్రయించడం ఇప్పటికీ ఉంది. దీన్ని దొంగ బాబాలు అవకాశంగా తీసుకుని వికృత చర్యలకు పాల్పడ్డారు.

 వారిద్దరు ఇలా టార్గెట్ చేశారు

వారిద్దరు ఇలా టార్గెట్ చేశారు

అమాయకులను భయపెట్టి పబ్బం గడుపుకునే దొంగ బాబాలు ఫయాజ్‌ మెహమూద్‌ అన్సారీ, అన్వరుల్లాఖాన్‌. ఇద్దరిలో అన్సారీ మహా ముదురు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన కుటుంబాలను గుర్తించి, భర్తకు దూరంగా ఉంటున్న భార్యలను లక్ష్యం చేసుకునేవాడు. వారి పిల్లలను దెయ్యం పట్టిందంటూ భయపెట్టేవాడు. వారిని దారిలోకి తెచ్చేందుకు తన వద్దకు రప్పించుకునే వాడు. పిల్లల చేతులు, కాళ్లూ కట్టేసి ఇనుప చీలలతో గుచ్చేవాడు.

అన్సారీ ఆగడాలు ఇలా..

అన్సారీ ఆగడాలు ఇలా..

అన్సారీ తాను క్షుద్రపూజల చేస్తుంటే బాగా మరిగిన వేడి నీళ్లను పోయాలని చెప్పేవాడు. అర్ధరాత్రి 3-4 గంటలు మోకాళ్లపై కూర్చోబెట్టి జననాంగాలపై కొవ్వొత్తిని అంటించే వాడు. బాధ భరించలేక చిన్నారులు కేకలు వేస్తూ ఉడేవారు. ఆ దృశ్యాలను కెమెరాలతో చిత్రీకరించేవాడు. దాన్ని నమ్మించేందుకు విష పదార్థంతో వాంతులు అయ్యేలా చేసేవాడు.

 కువైట్ వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని...

కువైట్ వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని...

మోతీనగర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ ఉపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లాడు. భార్య ఫర్హానా బేగం, కుమారుడు రయాన్‌ ఫైజల్‌ హైదరాబాదులోో ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని అన్సారీ వద్దకు తీసుకెళ్లింది. తాంత్రిక విద్యలంటూ అతడు పైశాచికంగా ప్రవర్తించాడు. పిల్లాడి కళ్లకు గంతలు కట్టి తల్లితో వేడినీళ్లు పోయించాడు. కువైట్‌ నుంచి వచ్చిన తండ్రి తీవ్రగాయాలతో అనారోగ్యానికి గురైన కొడుకు బాధను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని గుట్టు రట్టయింది.

 డిస్కో బాబా క్షుద్ర మాయ...

డిస్కో బాబా క్షుద్ర మాయ...

అన్వరుల్లా ఖాన్‌ అలియాస్‌ డిస్కోబాబా యునానీ డాక్టర్‌. ఆధునిక దుస్తుల్లో మెరిసిపోతూ ఏదైనా చేయగలనంటూ నమ్మబలికేవాడు. 2004లో హుస్సేనిఆలంలో ఓ ఇంట్లో లంకెబిందెలు బయటపడ్డాయి. దానికి కారణం తానేనంటూ ప్రచారం చేసుకున్నాడు. అప్పటి నుంచి బ్లాక్‌మేజిక్‌ పేరుతో చాలా మందిని మోసగించాడదు. ఈ క్రమంలోనే ఇటీవల వస్త్ర వ్యాపారంలో నష్టపోయిన కాచిగూడకు చెందిన ఇఫ్తేకర్‌ హుస్సేన్‌ డిస్కోబాబా వద్దకు వెళ్లి కష్టాలు తీరే మార్గం చెప్పమని కోరాడు.

నిధి నిక్షేపాల పేరు చెప్పి..

నిధి నిక్షేపాల పేరు చెప్పి..

భూమిలో దాచిన నిధి నిక్షేపాలు గుర్తించే అతీత శక్తులు తనకు ఉన్నాయని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుననాడు. ఖర్చుల నిమిత్తం దశలవారీగా 35లక్షలు కాజేశాడు. చార్మినార్‌లోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేశాడు. తవ్విన గుంతలో పాలు, వేడినీళ్లు పోయించాడు. పథకం ప్రకారం తవ్వకాలు జరిపే ప్రాంతంలో ముందుగానే భద్రపరచిన బంగారపు పూత పూసిప ఇత్తడి, మెరిసే రంగురాళ్లు బయటపడ్డాయి.
ఇది నిజమని భావించిన బాధితుడి కుటుంబం తాము మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 తల్లిని లోబరుచుకుని, కాలి బొటనవేలు కట్ చేసి.

తల్లిని లోబరుచుకుని, కాలి బొటనవేలు కట్ చేసి.

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టు కుని క్షుద్రపూజల పేరుతో కుమారుడిని చిత్రహింసలకు గురిచేసిన బాబా ఫయాజ్‌ మహమూద్‌ అన్సారీ, భార్య ఫర్హానా బేగానికి ఉరి శిక్ష విధించాలని మోతీనగర్‌కు చెందిన మహ్మద్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ డిమాండ్‌ చేశాడు. 2006 నుంచి 2013 వరకు భార్యతో కువైట్‌లో ఉన్నానని, అదే సంవత్సరం భార్య నగరానికి వచ్చిందని తెలిపాడు. మోతీనగర్‌లో ఉండబోనని ఖిల్వతలో కొద్ది రోజులు అద్దెకు ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత తనకు, తల్లిదండ్రులకు చెప్పకుండా షాహిన్‌నగర్‌ వీఐపీ స్కూల్‌ సమీపంలో ఉంటుందని తెలిపాడు. 2015 నుంచి తాంత్రిక్‌ బాబా ప్రతిరోజూ రాత్రిపూట అక్కడికి వస్తుండడం తమ పెద్దబ్బాయి రయాన్‌ ఫైజల్‌ గమనించాడని చెప్పాడు. మళ్లీ ఉదయం 6గంటలకు బాబా వచ్చేవాడని, అప్పుడు ముగ్గురు పిల్లలను తల్లిగారింటికి పంపేదని తెలిపాడు. గమనించిన కుమారుడు తల్లిని ప్రశ్నించాడని, విషయం తాంత్రిక్‌ బాబాకు చెప్పిందని, దాంతో కుమారుడిని హఫీజ్‌ బాబానగర్‌లో అతడి నివాసంలో బంధించాడన్నాడు. ప్రతిరోజూ రాత్రి 2 నుంచి 4 గంటల వరకు చిత్రహింసలు పెట్టేవాడని తెలిపాడు. సెప్టెంబర్‌ 11న తాను నగరానికి వచ్చానని, అప్పుడు కుమారుడు విషయం చెప్పగా నమ్మలేదన్నారు. చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు భార్య ఫోన్‌లో ఉండగా చూపింసాడని, 300 వీడియోలు కాపీ చేసి డీసీపీకి చూపించానని మొహియుద్దీన్‌ చెప్పాడు. బాబా రోజూ తమ ఇంటికి వస్తుండడంతో తల్లిని ప్రశ్నించానని, దాంతోబంధించి చిత్రహింసలు పెట్టాడని, కాలి బొటన వేలు కట్‌ చేసి రక్తం తీసేవాడని రయాన్‌ ఫైజల్‌ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+