హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం: 16 మంది రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తల అరెస్ట్, ఆయుధాలు సీజ్
హైదరాబాద్: నగరంలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి హైదరాబాద్‌లో నిఘా పెట్టిన పోలీసులు.. సోమవారం 16 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో 11 మంది భోపాల్, ఐదుగురు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి జిహాదీ సాహిత్యం, కత్తులు, ఎయిర్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. నగరంలో 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో ఉదయం నుంచి కొనసాగుతున్న దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం 16 మందిని అరెస్ట్ చేసి భోపాల్ తీసుకెళ్లారు మధ్యప్రదేశ్ పోలీసులు.
కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. 18 నెలలుగా రాడికల్ ఇష్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా సమాచారం ఉంది. వారికి సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే ఇక్కడి వారితో సంబంధాలు కలిగినవారి కోసం కూడా గాలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ తోపాటు దేశంలో ప్రధాన నగరాల్లో ఎలాంటి పేలుళ్లకైనా ఈ ఉగ్రమూకలు దాడులకు ప్రణాళికలు రచించాయా? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడటం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications