తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి: 160కుపైగా కొత్త కేసులు, జిల్లాలవారీగా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 33,506 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 162 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,67,887కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3930గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 647 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

 162 new corona cases, 01 death reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 214 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,59,722కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4235 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 09, జీహెచ్ఎంసీలో 55. జగిత్యాలలో 01, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 02, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 10, ఖమ్మంలో 04, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 01, మెదక్‌లో 04, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 10, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 11, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 02, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 05, సిద్దిపేటలో 07, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 07, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కామారెడ్డి, కొమరభీం అసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నిర్మల్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కొత్తగా 18,166 కేసులు వెలుగులోకి వచ్చాయి. 214 రోజుల కనిష్ఠానికి ఇవి చేరాయి. శనివారం 214 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,589కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 23,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3.32 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 97.99 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,30,971యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 0.68శాతంగా ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 94.7కోట్లు దాటింది. త్వరలోనే వంద కోట్ల వ్యాక్నినేషన్ పూర్తి చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+