తెలంగాణలో 1,640 కరోనా కేసులు.., 8 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 1500 పైచిలుకు కేసులు వచ్చాయి. నిన్న 1567 మందికి వైరస్ రాగా.. ఇవాళ 1640 మందికి పాజిటివ్ వచ్చింది. 15 వేల 445 మందికి పరీక్ష చేయగా వీరికి పాజిటివ్ వచ్చింది.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరింది. గత 24 గంటల్లో ఎనిమిది మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 447కి చేరుకుంది. కరోనా నుంచి 1,007 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 40,334 చేరింది. నమోదైన కేసుల్లో ఇది 76.8 శాతమని రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

1640 coronavirus positive cases register in telangana..

Recommended Video

    Fact Check : No Lockdown In Vijayawada - Collector || Oneindia Telugu

    24వ తేదీ వరకు 3 లక్షల 37 వేల 771 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. మిలియన్ జనాభాకు 8 వేల 444 మందికి పరీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 662 రాగా.. ఇవాళ 683 కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 135, సంగారెడ్డిలో 102, కరీంనగర్‌లో 100, పెద్దపల్లిలో 98, నాగర్ కర్నూల్ 52, నల్గొండ 42 కేసులు వచ్చాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+