గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతులసంఖ్య, పీఎం మోదీ, సీఎం రేవంత్ దిగ్బ్రాంతి

హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ వద్ద ఒక నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కనీసం 17 మంది మరణించారని తెలుస్తుంది. ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు స్ధానిక అధికారులు తెలియజేశారు.

భారీ మంటల్లో పలువురు సజీవ దహనం
ప్రమాద సమాచారం అందుతూనే, 11 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేయటానికి పని చేశాయి. 16 మందిని సహాయ సిబ్బంది రక్షించినట్లు పోలీసులు చెప్పారు.
నేడు ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ మంటలు చెలరేగడంతో పలువురు భవనంలోనే సజీవ దహనమయ్యారు.

17 died in gulzar house fire accident pm modi and revanth reddy shocked pm announced exgratia

సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి .. కీలక ఆదేశం
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా, ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పీఎం..
హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హైదరాబాద్‌ మీర్‌చౌక్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాద విషాదంపై పీఎం మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

రెండు లక్షల పరిహారం ప్రకటన
చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+