ఒక్క బాలికపై ఆరుగురు యువకులు... రమ్మని మెసేజ్ పంపి గ్యాంగ్ రేప్

ఊరి చివర ఉన్న ఆలయానికి రమ్యని ఓ బాలికకు మెసేజ్ పంపిన ఓ యువకుడు ఆమె అక్కడికి రాగానే తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

దండేపల్లి: టీనేజి బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దండేపల్లి ఎస్సై సంజీవ్ కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

లక్ష్మీకాంతపూర్ కు చెందిన బాలిక(17)కు అదే గ్రామానికి చెందిన లక్షణ్ గత నెల 12న గ్రామ సమీపంలోని ఆలయం వద్దకు రావాలంటూ మెసేజ్ పంపాడు. దీంతో ఆమె ఆలయం వద్దకు వెళ్లింది.

అప్పటికే అక్కడ లక్షణ్ తోపాటు అతడి మిత్రులు ఐదుగురు ఉన్నారు. బాలిక వచ్చీరావడంతోనే బలవంతంగా వారు ఆమెను సమీపంలోని చేనులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పి బెదిరించి పంపించేశారు.

17 year-old Girl Gang Raped by Six Men

భయపడిన బాలిక ఆ అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే ఆమె వాలకం చూసిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగినదంతా వారికి చెప్పేసింది. వారు వెంటనే దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆమెపై సామూహిక అత్యచారానికి ఒడిగట్టిన లక్ష్మణ్, అతడి ఐదుగురు మిత్రులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+