వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో తాజాగా 18 మందికి స్వైన్ ఫ్లూ...జర జాగ్రత్త!

తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరిలో 13 మంది హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చలికాలం ముగుస్తున్నా స్వైన్ ఫ్లూ మహమ్మారి మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని వీడటం లేదు. తాజాగా తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరందరికీ స్వైన్ ఫ్లూ పాజిటివ్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వీరిలో 13 మంది హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. గత ఏడాది కూడా 3,696 మంది శాంపిల్స్ ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వెల్లడయింది.

18 Fresh Swine Flu Cases Reported In Telangana

ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో సరైన వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఎవరికైనా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ రోజులపా కనిపిస్తే.. స్వైన్ ఫ్లూగా అనుమానించాలని, ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని పేర్కొన్నారు.

English summary
Hyderabad: Eighteen fresh positive cases of swine flu have been reported in Telangana, where 13 people have died due to the H1N1 virus and other complications since August 1 last year. Eighty-five cases were tested for swine flu yesterday and 18 of them came positive for the deadly virus, a bulletin on swine flu issued by the State Government said in Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X