తెలంగాణలోనూ కరోనా కల్లోలం: 60 వేలకు చేరిన పాజిటివ్ కేసులు, 500 దాటిన మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1764 కేసులు రాగా.. బుధవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 18 వేల 263 మందికి పరీక్షలు చేశారు. 1811 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం సంఖ్య 60 వేల 717 మందికి చేరింది.

వీరిలో ప్రస్తుతం 15 వేల 640 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ తగ్గడంతో 44 వేల 572 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో వైరస్ సోకి 13 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 505కి చేరింది.

1811 corona cases are register in the telangana state

జీహెచ్ఎంసీలో 521 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మంగళవారం 509, సోమవారం 531 కేసులు నమోదయ్యాయి. ఇటు మేడ్చల్ మల్కాజిగిరిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 151 కేసులు నమోదైనట్టు బులెటిన్‌లో పేర్కొన్నది. నల్గొండలో 61, మహబూబ్ నగర్‌లో 41 కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కేసులు 60 వేల మార్క్ దాటగా.. మృతుల సంఖ్య 500 దాటింది.

Recommended Video

    Unlock 3.0 : రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత | Unlock 3.0 Guidelines ఇవే!! || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+