24 గంటలుగా బోరుబావిలోనె బాలిక,మరింత లోతుల్లోకి పాప
ఏడాదిన్నర వయస్సున్న వీణ అనే బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడింది. ఆమెను రక్షించేందుకు సహయకచర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో చోటుచేసుకొంది.
చేవెళ్ళ: ఏడాదిన్నర వయస్సున్న వీణ అనే బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడింది.24 గంటలుగా బాలికను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు.అయితే బాలిక మరింత లోపలికి జారిపోయింది.ఆమెను రక్షించేందుకు సహయకచర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో చోటుచేసుకొంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం చన్ వెళ్ళి గ్రామంలో యాదయ్య, రేణుక దంపతులు పొలం దగ్గరే నివాసం ఉంటున్నారు. వీరిది వికారాబాద్ జిల్లా యాలాల మండలం. బతుకుదెరువు కోసం యాదయ్య దంపతులు చన్ వెళ్ళి వచ్చారు.
వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె హర్షి, చిన్న కూతురు వీణ. గురువారం నాడు భార్యభర్తలు పొలం వద్ద పనులు చేస్తుండగా, ఏడాదిన్నర వయస్సున్న వీణ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. బోరుబావి వీణ 45 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిందని అధికారులు గుర్తించారు.
బోరుబావిలో పడిన బాలికను రక్షించేందుకు సహయక చర్యలు కొనసాగుతున్నాయి.అయితే చైన్ పుల్లింగ్ టెక్నాలజీతో బాలికను వెలికితీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి నిపుణుల సహయం తీసుకొంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. బాలికను వెలికితీసేందుకు రోబో హ్యాండ్ టెక్నాలజీ, రోబోటిక్ హ్యాండ్, చైన్ పుల్లింక్ టెక్నాలజీలు ఫలితమివ్వలేదు.అయితే చిన్నారికి ఆక్సిజన్ ను అందిస్తున్నారు.
బాలికను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బాలిక మరింత లోతుకు జారిపోయింది. చిన్నారిని రక్షించే ప్రయత్నాలు క్లిష్టతరంగా ఉన్నాయి. చిన్నారి రక్షించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయి.

కొనసాగుతున్న సహయకచర్యలు
గురువారం సాయంత్రం చన్ వెళ్ళి గ్రామ సమీపంలోని వ్యవసాయపొలం వద్ద బోరుబావిలో పడిన వీణ అనే బాలికను రక్షించేందుకు సహయకచర్యలను కొనసాగిస్తున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సంఘటనస్థలానికి చేరుకొన్నారు. సహయకచర్యలను పర్యవేక్షించారు. చిన్నారి ప్రాణాలను కాపాడాలని ఆయన అధికారులకు సూచించారు. 108 సిబ్బంది పైపుల ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నారు. మూడు జేసీబీలు, ఒక హిటాచీ సహయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వుతున్నారు.

సజీవంగా బోరుబావిలో బాలిక
బోరుబావిలో పడిన ఏడాదిన్నర వయస్సున్న బాలిక వీణ సజీవంగా ఉందని అధికారులు అబిప్రాయపడుతున్నారు. బోరుబావికి సమాంతరంగా తవ్వుతున్నారు. పొలంలో ఉన్న బండరాళ్ళు సహయకచర్యలకు ఆటంకంగా మారాయి. ప్రత్యేక కెమెరాను బావిలోకి పంపించి చిన్నారి కదలికలను గుర్తించారు. చిన్నారికి ధైర్యం కల్గించేందుకుగాను తల్లితో మాట్లాడించారు.

రంగంలోకి కరుణాకరన్ బృందం
బోరుబావిలో పడిన చిన్నారులను ఇనుపరాడ్ల సహయంతో రక్షించడంలో పుట్టా కరుణాకర్ బృందం దిట్ట.దీంతో ఆయనను కూడ సంఘటనస్థలానికి రప్పించారు. కరుణాకర్ బృందానికి తోడుగా గుంటూరు జిల్లా మంగళగిరి పదో బెటాలియన్ కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడ రంగంలోకి దిగింది.ప్రత్యేక పరికరాలను కూడ తమ వెంట తీసుకొచ్చారు.

మరింత లోపలికి జారినపడిన బాలిక
బోరుబావి 540 అడుగుల లోతుంది. అయితే ఆడుకొంటూ ప్రమాదవశాత్తు బాలిక బోరుబావిలో పడిపోయింది. అయితే బోరుబావిలో సుమారు 36 అడుగుల వద్ద బాలిక పడిపోయింది. బోరుబావిలో మోటార్ పక్కనే చిన్నారి చిక్కుకొందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతమైతే బాలిక సురక్షితంగానే ఉందని అధికారులు గుర్తించారు.అయితే బాలికను రక్షించే చర్యల్లో భాగంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో మోటార్ పక్కనే పడిన బాలిక బోరుబావిలో మరింత లోపలికి జారిపోయింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications