రాష్ట్రంలో 2.75 కోట్ల మంది పేదలే, ఆ లెక్కలు తప్పన్న మంత్రి ఈటెల

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ఉంటే, వారిలో 2.75 కోట్ల మంది దారిద్రరేఖకు దిగువన ఉన్నవారేనని సివిల్ సప్లయ్ శాఖ చెబుతోంది.అయితే ఈ లెక్కలు తప్పు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తప్పు అని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా 6,380 కోట్ల రూపాయాలను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేసేందుకుగాను ఖర్చు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో రూ.29 ఉంటే, కేవలం, రూపాయికే కిలో బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.

2.75 crore out of 3.5 crore people listed below poverty line in Telangana

ఈ బియ్యం పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.3,715 కోట్లను సబ్సిడీ కోసం చెల్లిస్తోంది. మిగిలిన రూ,.2,655 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

సివిల్ సప్లయ్ వద్ద ఉన్న లెక్కలు తప్పుడు లెక్కలనీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. పేదలకు పంపిణీ చేస్తున్న సబ్సిడీ బియ్యం బహిరంగ మార్కెట్లోకి తరలించబడుతోందని ఆయన చెప్పారు.అయితే బోగస్ లబ్దిదారులను ఏరివేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Out of the 3.5 crore people in the state, 2.75 crore are below the poverty line according to statistics available with the civil supplies department.
Please Wait while comments are loading...