ఇద్దరు టెన్త్ విద్యార్ధినుల ఆత్మహత్య, ఎందుకంటే?

హైదరాబాద్: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో టిఎన్ఆర్ అపార్ట్‌మెంట్ ‌లోని ఎనిమిదో అంతస్థు నుండి ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదో తరగతి విద్యార్థినులు భార్గవి పటేల్, శ్రావణిలు అక్కడికక్కడే చనిపోయారు.

ఓ ప్రైవేట్ స్కూల్‌లో వీరిద్దరూ చదువుతున్నారు. అయితే కొంత కాలంగా వీరద్దరూ కలిసి చదువుకొంటున్నారు. గురువారం సాయంత్రం పూట ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరూ కూడ ఎనిమిదో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 2 girl students committed suicide in saroornagar

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి ఆత్మహత్యకు కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారా , ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+