కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్: ఇద్దరు మృతి
హైదరాబాద్: కర్ణాటకలోని వాడి- గుల్బర్గా రైల్వేస్టేషన్ల మధ్యలోని మార్టూరు గ్రామం వద్ద సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు రైలు బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారే.
ఈ రైలు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, లక్ష్మీలు మరణించారు. ఈ ఘటనలో సల్మా, రాజు, శ్రీకాంత్‌లు గాయపడ్డారు. ఈ ముగ్గురు ప్రయాణికులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కారని అధికారులు చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ముంబైకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను ఆంబులెన్సుల ద్వారా గుల్బర్గా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్-ముంబై దురంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి 11.05 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. ప్రమాద సమయంలో గంటకు 110 కిమీ వేగంలో రైలు నడుస్తుందని అధికారులు చెప్పారు.
తెల్లవారుజామున 2.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. రైళ్ల రాకపోకల సమాచారం తెలిపేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు తలా రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి తలా రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ. 25 వేల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె. మిట్టల్ తెలిపారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. ఈ ఘోరం ఎలా జరిగిందనేదానిపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు మిట్టల్ పేర్కొన్నారు. రైలు ప్రమాదంతో అధికారులు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయచూర్-బీజాపూర్ ప్యాసింజరు, ముంబై- సికింద్రాబాద్ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఫలక్‌నుమా- గుల్బర్గా ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేశారు.
రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లు
సికింద్రాబాద్ హెల్ప్‌లైన్ నెం. 040-27700868
హైదరాబాద్ హెల్ప్‌లైన్ నెం 040-23200865
వికారాబాద్ హెల్ప్‌లైన్ నెం 08416- 252103
తాండూరు హెల్ప్‌లైన్ నెం 08411-272010
గుల్బర్గా హెల్ప్‌లైన్ నెం.08472-255966
Saddened by Duranto accident.Ordered enquiry.Immediate medical relief& other assistance rushed.Chair Rail board asked to rush.
— Suresh Prabhu (@sureshpprabhu) September 12, 2015 All injured bring rushed to hospitals and treated by medical team.We give ex gratia to injured,unfortunate families of dead.monitoring it
— Suresh Prabhu (@sureshpprabhu) September 12, 2015 All possible assistance is provided to all affected, all being rescued.Very unfortunate for this.Cause investigated to take action
— Suresh Prabhu (@sureshpprabhu) September 12, 2015 All 7 injured rushed to civil hospital, treatment on,rail doctors r on job.All arrangements made to take others to destination,special train
— Suresh Prabhu (@sureshpprabhu) September 12, 2015 All possible help being provided to affected families and passengers.Chairman Rail Board, GM, DRM, all orders to be on rescue job
— Suresh Prabhu (@sureshpprabhu) September 12, 2015 -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications