సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఆ దిశగా కీలక నిర్ణయం
Vande Bharat express: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది.
ఇప్పటివరకు మొత్తం 66 రైళ్లు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 66 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణ
సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు. ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది.
అతి తక్కువ ఆక్యుపెన్సీ
ఇదే డిమాండ్ అన్ని మార్గాల్లోనూ ఉండట్లేదు. కొన్ని రూట్లల్లో ఈ రైళ్లు అతి తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తోన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తోన్నాయి. కనీసం మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావట్లేదనే అభిప్రాయం ఉంది. వాటి నిర్వహణ భారంగా మారిందని అంటున్నారు.
నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందే భారత్
అలాంటి సర్వీసుల్లో ఒకటి.. నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన పట్టాలెక్కిందిది. ప్రారంభం నుంచీ కూడా అతి తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తోందీ రైలు. ప్రయాణికుల నిష్పత్తి 25 శాతానికి మించట్లేదంటూ గతంలోనే వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
ఎనిమిది కోచ్‌లకు తగ్గించేలా
దీనితో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ రైలుకు ఉన్న 20 బోగీలను కుదించాలని భావిస్తోన్నారు. ఎనిమిది కోచ్‌లకు తగ్గించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. దీనితో పాటు టైమ్ టేబుల్‌లో కూడా మార్పులు చేయాలని నాగ్‌పూర్ డివిజన్ రైల్వే అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
నిర్వహణ భారం తగ్గడం
ప్రస్తుతం నాగ్‌పూర్ నుంచి తెల్లవారు జామున 5 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరి వెళ్తోంది. దీన్ని ఉదయం 7 గంటలకు మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల కొంతలో కొంత నిర్వహణ భారం తగ్గడంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications