భయపెట్టి పదో తరగతి అమ్మాయిపై అత్యాచారం, అరెస్టు
హైదరాబాద్: పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని హైదరాబాదులోని సంతోష్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. ఏసిపి వి.శ్రీనివాసులు కథనం ప్రకారం- ఈదిబజార్, నెహ్రూనగర్ కాలనీలో నివసిస్తున్న కుటుంబంతో నిందితుడు ముబషీర్ (20) సన్నిహిత సంబంధాలు కుటుంబానికి వుండేవి.
తమ ఇంటికి తరచూ వచ్చి వెళుతుండే బాలిక (15)పై ముబషీర్ కన్నుపడింది. ఈనెల 13న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను తమ ఇంట్లోకి తీసుకెళ్లి భయపెట్టి అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పంపించాడు. బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులతో చెప్పగా వారు సంతోషనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఆ రోజు నుంచి తప్పించుకు తిరుగుతున్న ముబషీర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణ పర్యవేక్షణలో ఏసిపి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ ఎం.శంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సయ్యద్ ముబషీర్ కొద్ది నెలల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. తన ఇంటికి వచ్చిన అమ్మాయిని బలవంతంగా తన పడక గదిలోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
