తెలంగాణలో కొత్తగా 202 కరోనా కేసులు: తగ్గిన రికవరీ, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా మరోసారి కరోనా కొత్త కేసులు 46,808 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 202 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 202 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,69,365కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3941గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1769 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,61,484కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3940 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 52. జగిత్యాలలో 08, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 19, ఖమ్మంలో 09, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 05, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 09, ములుగులో 01, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 16, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 11, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 18, సంగారెడ్డిలో 05, సిద్దిపేటలో 03, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 02, వరంగల్ అర్బన్‌లో 11, యాదాద్రి భువనగిరిలో 02 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జోగులాంబ గద్వాల, కొమరంభీం అసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త కేసులు 231 రోజులు, యాక్టివ్ కేసులు 227 రోజుల కనిష్టానికి క్షీణించడం గమనార్హం. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11,81,314 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 13,058 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3,40,94,373కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 164 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,52,454కు పెరిగింది. సోమవారం 19,470 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడినవారి సంఖ్య ,34,58,801కి పెరిగింది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,83,118కి తగ్గింది. దేశంలో రికవరీ రేటు 98.14 శాతానికి పెరగ్గా.. పాజిటివిటీ రేటు 0.54 శాతానికి తగ్గింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం 87,41,160 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 98 కోట్లను దాటింది. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ సంఖ్య 100 కోట్లను దాటే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications