తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు: 5వేల దిగువకు యాక్టివ్ కేసులు, ఆ 3 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 45,274 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 208 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు, ఇద్దరు మృతి
తాజాగా, నమోదైన 208 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,63,662కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3906కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1481 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 4991 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,54,765కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,991 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.65 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది. మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, 30వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11,77,607 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్ల చేరింది. ఆదివారం 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45 లక్షలకు చేరింది. ఆదివారం 43,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.72 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.18 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.95 శాతానికి తగ్గింది. ఆదివారంనాడు 37,78,296 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 80,85,68,144కు చేరింది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 49. జగిత్యాలలో 06, జనగామలో 02, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 02, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 15, ఖమ్మంలో 12, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 11, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 15, ములుగులో 01, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 06, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 08, రాజన్న సిరిసిల్లలో 08, రంగారెడ్డిలో 09, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 05, సూర్యాపేటలో 10, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 20, యాదాద్రి భువనగిరిలో 05 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాల్ పల్లి, కొమరంభీం అసిఫాబాద్, వికారాబాద్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications