అరుదు, అందంగా ఉన్నారు: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు (ఫోటో)
హైదరాబాద్: నగరంలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే... మెహిదీపట్నం, మీనా మెటర్నిటీ ఆసుపత్రిలో రాజేంద్రనగర్ సన్‌సిటీకి చెందిన జాహెదా బేగం (23) ప్రసంవ కోసం చేరారు. సోమవారం ఆవిడ ముగ్గురు పండంటి పిల్లలకు జన్మినిచ్చారు.

వీరిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ముగ్గురూ 2 కిలోల చొప్పున బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి గైనకాలజిస్ట్ పోహేబాషుకూర్, చిన్న పిల్లల డాక్టర్ టిప్పు సుల్తాన్ చెప్పారు. కాగా, జాహెదా బేగం తొలిసారి గర్భం ధరించినప్పుడు గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నారన్నారు.

అయితే, అప్పుడు అబార్షన్ అయిందని వైద్యులు చెప్పారు. రెండోసారి మాత్రం 5వ నెల నుంచి ప్రత్యేక చికిత్స, 15 రోజులకు ఒకసారి వ్యాక్సిన్లు ఇవ్వడంతో జాహెదా బేగం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిందని డాక్టర్ సోహేబా షుకూర్ మీడియా సమావేశంలో తెలిపారు.












Click it and Unblock the Notifications