తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, రికవరీలు కూడా: ఆ మూడు జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. గత 24 గంటల్లో 50,505 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు, ఒకరు మృతి


తాజాగా, నమోదైన 244 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,63,906కు చేరింది. కరోనాతో కొత్తగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3907కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1483 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 4938 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 4938 యాక్టివ్ కేసులు


గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,55,061కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.66 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది. మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, 30వేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,13,951 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,115 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్ల చేరింది. ఆదివారం 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45లక్షలకు పెరిగింది. ఆదివారం 34వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.75 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.09 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.92 శాతానికి తగ్గింది. ఆదివారంనాడు 96,46,778 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 8.85 కోట్లకు చేరింది.

Recommended Video

    గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!
    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు


    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 06, జీహెచ్ఎంసీలో 72. జగిత్యాలలో 08, జనగామలో 02, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 19, ఖమ్మంలో 17, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 04, మంచిర్యాలలో 07, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 09, ములుగులో 02, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 19, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 09, రాజన్న సిరిసిల్లలో 04, రంగారెడ్డిలో 18, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 02, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 01, వనపర్తిలో 03, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 14, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాల్ పల్లి, నారాయణ్ పేట్, నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+