హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ గణేషుడు: విగ్రహంపై 3.83 లక్షల వజ్రాలు పొదిగారు..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ కోలాహలం నెలకొంది. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేషుడి మంటపాలు వెలిశాయి. విఘ్ననాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తోన్నారు జనం. హైదరాబాద్ లో ప్రతి చోటా గణేషుడి మండపాలు ఏర్పాటయ్యాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో మండపాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో గణేష్ చతుర్థి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా విభిన్న ఆకృతులు, అలంకరణలతో వినాయక విగ్రహాలు కొలువుదీరడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఈసారి భాగ్యనగరంలో ఒక విభిన్న గణపతి విగ్రహం భక్తుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. బేగంబజార్‌ లో ఏర్పాటు చేసిన లీ-చీ కా రాజా గణపతి విగ్రహం అది. దీన్ని ఏకంగా 24 క్యారెట్ల బంగారు పూతతో తయారు చేశారు. అదొక్కటే కాదు.. ఈ విగ్రహంపై 3.83 లక్షలకు పైగా వజ్రాలను పొదిగారు.

24K Gold Plated Spectacular Gold Ganesha Idol With 383800 Diamonds Installed Begum Bazar Hyderabad

విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ గణేషుడి మండపం వెలిగిపోతోంది. విద్యుత్ కాంతులు పడ్డప్పుడు తళతళలాడుతోంది. లక్షలాది అమెరికన్ డైమండ్లపై వాటి వెలుగులు ప్రసరించినప్పుడు వెలువడే మెరుపులు భక్తులను మంత్రముగ్ధులను చేస్తోన్నాయి. ఈ విగ్రహం రూపకల్పనకు స్ఫూర్తి.. ముంబైలో అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్ చా రాజా వినాయకుడు. ఈ విగ్రహం శైలిలో దీన్ని కూడా తయారు చేయించారు పండాల్ నిర్వాహకులు.

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి ట్రావెల్ చేసిన గణపయ్య
కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి ట్రావెల్ చేసిన గణపయ్య

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకరణను పోలిన విధంగా ఈ గణపతి స్వరూపాన్ని తయారు చేశారు. లాల్‌బాగ్ చా రాజా ముఖవర్చస్సు, ఆసన శైలిని థీమ్ గా తీసుకున్నారు. తిరుమల శ్రీవారి చేతిలో ఉండే శంఖు, చక్రాలను అమర్చారు. ఒక చేత్తో శంఖు, మరో చేత్తో సుదర్శన చక్రం కనిపించింది. అలాగే.. ఎడమ వైపున గద ఉంచారు. చుట్టూ శ్రీమహావిష్ణువు దశావతరాలతో కూడిన అలంకరణ చేశారు. దీన్ని చూడటానికి జనం బారులు తీరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+