వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం, స్థానికులు ఏం చేశారంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో సోమవారం నాడు ఓ వికలాంగురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికులు నిందితులను చితకబాది పోలీసులకు అప్పగించారు.

అడవిదేవులపల్లి మండలం హమ్ తండాలో ఇటీవలనే దత్తాత్రేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఆదివారం రాత్రి పూట కోలాట ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ ప్రదర్శనను చూసేందుకుగాను గోన్యాతండాకు చెందిన వికలాంగురాలు వెళ్ళింది.

3 men allegedly gang rape on a disable wowan in Nalgonda district

అయితే కోలాటం చూసేందుకు వచ్చిన ఆమె కొద్దిసేపటికి బహిర్బూమికి వెళ్ళింది. అడవిదేవులపల్లికి చెందిన గొడుగు సతీష్, గొడుగు హనుమయ్య, బిల్లకంటి మహేష్ లు ఆమెను అనుసరించారు. ఆమెను బలవంతంగా పక్కనే పంటచేలోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను అక్కడే వదిలేసి తిరిగి కోలాట ప్రదర్శన వద్దకు వెళ్ళారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేస్తూ కోలాటం జరిగే ప్రాంతానికి వచ్చి జరిగిన విషయాన్ని రోధిస్తూ బంధువులకు చెప్పింది. అక్కడే ఉన్న గొడుగు సతీష్ ను గుర్తించింది. దీంతో అతడిని స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 40 year old woman was allegedly gang raped by three men at Adavidevulapally village in Nalgonda district on Sunday night.police arrested one person.
Please Wait while comments are loading...