జీఈఎస్ 2017: మోడీ పక్కా ప్లాన్, ఇవాంకా ట్రంప్ రాకకు కారణమిదే!
హైదరాబాద్: దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న జీఈఎస్ 2017 సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహదారు ఇవాంకా ట్రంప్‌ను ఆహ్వనించడం వెనుక ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహత్మకంగా వ్యవహరించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవాంకా ట్రంప్‌ను ఈ సదస్సుకు ఇవాంకా ట్రంప్‌ను ఆహ్వనించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలను చెబతున్నారు.
Recommended Video

జీఈఎస్ సదస్సులో పాల్గొనాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురును ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వనించారు. అంతేకాదు అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తల బృందానికి ఇవాంకా ట్రంప్ సారధ్యం వహిస్తున్నారు.
దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సు జరుగుతోంది. అయితే ఈ సదస్సుకు హైద్రాబాద్ వేదికగా నిలిచింది. 2010 తర్వాత తొలిసారిగా ఈ సదస్సు ఇండియాలో జరుగుతోంది. అమెరికా, ఇండియా, నీతి ఆయోగ్, తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

ఇవాంకా ట్రంప్ ఆహ్వనానికి కారణాలివే
జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు,. ట్రంప్ సలహదారు ఇవాంకా ట్రంప్‌ను ఇండియా ప్రధానమంత్రి ఆహ్వనించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా, అమెరికాల మధ్య సత్సంబంధాలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఇండియాలో పెట్టుబడులను ఆహ్వనించే ఉద్దేశ్యంతో జీఈఎస్ సదస్సును ఇండియాలో నిర్వహించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఇవాంకా ట్రంప్‌ను ఆహ్వనించడం వెనుక అగ్ర రాజ్యంతో ఇండియా మధ్య మైత్రి మరింత పెంపొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
జీఈఎస్ 2017 సదస్సు ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తలపై ఫోకస్ పెట్టింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఇందులో 50 శాతానికి పైగా మహిళలే కావడం గమనార్హం. అయితే తొలిసారిగా మహిళలపై ఫోకస్ చేస్తూ ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దరిమిలా ఇవాంకా ట్రంప్‌ను ఈ సదస్సులో పాల్గొనేలా చేయడం ద్వారా మహిళలకు ప్రోత్సహం కల్పించినట్టు ఉంటుందని భావించారు. అమెరికా టూర్ సందర్భంగా ఇవాంకాను జీఈఎస్ 2017 సదస్సుకు రావాలని మోడీ ఆహ్వనించారు. అంతేకాదు ఈ విషయమై మోడీ ట్వీట్ కూడ చేశారు.

ఇండియాలో పెట్టుబడులకు ప్లాన్
ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను కూడ జీఈఎస్ 2017 సదస్సులో మోడీ, కెసిఆర్ ప్రస్తావించారు. ఈ సదస్సు ద్వారా ఇండియాలో భారీగా పెట్టుబడులను ఆహ్వనించాలని మోడీ ప్లాన్ చేశారు. ఇవాంక అమెరికాలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా పేరుపొందారు. ఆమె గనుక ఈ సదస్సుకు హాజరైతే.. అమెరికా, ఇతర దేశాల మహిళా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రధాని భావించారు.

ఇండియా-అమెరికా మధ్య మైత్రి
ఇండియా-అమెరికా మధ్య మైత్రి మరింత బలపడేలా మోడీ ప్లాన్ చేశారు.ఇవాంకా ట్రంప్‌ను సదస్సుకు ఆహ్వనించడం ద్వారా రెండు దేశాల ద్వారా బంధం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. జీఈఎస్ సదస్సులో ప్రసంగించిన ఇవాంకా ట్రంప్ రెండు దేశాల మధ్య మైత్రి గురించి ప్రస్తావించారు. ఇండియా మాకు మిత్ర దేశమని ట్రంప్ చెప్పిన విషయాన్ని ఇవాంకా ట్రంప్ గుర్తు చేశారు. ఇండియన్ల గురించి ఇవాంకా తన ప్రసంగంలో పొగడ్తల విషయాన్ని గుర్తు చేశారు.

జీఈఎస్ సమ్మిట్‌లో భారత్, అమెరికన్లే ఎక్కువ
జీఈఎస్ 2017 సమ్మిట్‌లో సుమారు 1600 ప్రతినిధులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో అమెరికా , ఇండియా నుండి వచ్చిన ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇతర దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయితే పది దేశాల నుండి పురుషులు మాత్రం లేరు. ఈ దేశాల నుండి కేవలం మహిళా ప్రతినిధులు మాత్రమే ఉన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications