ఢీకొన్న టాటా ఏసీ-మినీ బస్, నలుగురు మృతి
వరంగల్: జిల్లాలోని రఘనాథపల్లి మండలంలోని వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, మినీ బస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా... మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారిని 108 వాహనంలో జనగాం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అక్కడి స్ధానికులు కొందరు అంటుండగా, దట్టంగా అలముకున్న పొగ మంచని మరికొందరు అంటున్నారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు
నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటిలోని వ్యక్తులు బస్సు ఢీకొన్న గదిలో కాకుండా మరో గదిలో నిద్రించడంతో పెనుప్రమాదం తప్పింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications