40 కిలోల గంజాయి పట్టివేత: నిందితుల్లో ఓ మహళ, కేసు నమోదు
రైలులో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని రైల్వే పోలీసు పట్టుకున్నారు. ఓ మహిళ తన చిన్నపాపతో సహా మరో ముగ్గురు నిందితులను వెంటాడారు.
వరంగల్ :రైలులో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని రైల్వే పోలీసు పట్టుకున్నారు. కాజీపేట రైల్వే సీఐ ఎస్. వెంకటేష్ ఆదివారం మీడియం సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది.
ఆ సమాచారం మేరకు వరంగల్ రైల్వే సీఐ జె. వెంకటరత్నం, కాజీపేట సీఐ ఎస్. వెంకటేశ్, ఆర్పీఎఫ్ జాయింట్‌గా విజయవాడ రైల్వేస్టేషన్ నుంచే రైల్వే స్పెషల్ టీం వెంటాడింది. తమకు అందిన సమాచారం మేరకు ఓ మహిళ తన చిన్నపాపతో సహా మరో ముగ్గురు నిందితులను వెంటాడారు.

స్పెషల్ పార్టీ పోలీసును చూసి నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా రైలు స్టేషన్ ఘన్‌పూర్ చేరుకోగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరు ఎస్- 9 రిజర్వేషన్ కోచ్‌లో గంజాయి ఉందని తెలపడంతో స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు.
విచారణలో గంజాయిని తామే తరలిస్తున్నామని అంగీకరించారు. వీరిలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన గడధర్ పాండా, సాన్‌స్వైన్, చిత్రసేన్ జేనాతో పాటు ఒడిశా, గజపతి జిల్లాకు చెందిన మీనాక్షి అనే మహిళ కూడా ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications