తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, నలుగురు మృతి: ఆ 3 జిల్లాల్లో ‘0’ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది వారాలుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 91,457 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 494 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 494 కరోనా కేసులు, 4 మరణాలు

తెలంగాణలో కొత్తగా 494 కరోనా కేసులు, 4 మరణాలు

తాజాగా, నమోదైన 494 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,41,153కు చేరింది. కరోనాతో కొత్తగా నలుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3784కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

Recommended Video

    Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist
    తెలంగాణలో 9,405 యాక్టివ్ కేసులు

    తెలంగాణలో 9,405 యాక్టివ్ కేసులు

    గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 710 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,27,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలోరికవరీ రేటు 97.94 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది.

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 15, జీహెచ్ఎంసీలో 76. జగిత్యాలలో 24, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగులాంబ గద్వాలలో 05, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 49, ఖమ్మంలో 40, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 06, మహబూబాబాద్‌లో 12, మంచిర్యాలలో 11, మెదక్‌లో 05, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 19, ములుగులో 04, నాగర్ కర్నూలులో 03, నల్గొండలో 19, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 06, పెద్దపల్లిలో 30, రాజన్న సిరిసిల్లలో 12, రంగారెడ్డిలో 31, సంగారెడ్డిలో 12, సిద్దిపేటలో 14, సూర్యాపేటలో 14, వికారాబాద్ లో 01, వనపర్తిలో 03, వరంగల్ రూరల్‌లో 18, వరంగల్ అర్బన్‌లో 43, యాదాద్రి భువనగిరిలో 09 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నిర్మల్, కామారెడ్డి, కొమరంభీం అసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసూ నమోదు కాలేదు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+