చంబాలో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదు
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. చంబా పట్టణంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. చంబా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలో కూడా బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.
గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది. భూమికి దిగువన 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి.

అంతకుముందు ఏప్రిల్ 1న హిమాచల్‌ప్రదేశ్‌లోని చమోలి, లాహోల్, స్పితిలలో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. కాగా, ఇటీవల కాలంలో హిమాలయ, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదవుతుండటం గమనార్హం.
Earthquake of Magnitude:5.3, Occurred on 04-04-2024, 21:34:32 IST, Lat: 33.09 & Long: 76.59, Depth: 10 Km ,Location:Chamba, Himachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/SYNmt1ew5B @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia… pic.twitter.com/Bc2FRprnWw
— National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2024
తైవాన్ భూకంపం: 9కి చేరిన మృతులు
తైవాన్ ద్వీపంలో గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా బలమైన భూకంపం రెండు రోజుల క్రితం సంభవించింది. తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. తైవాన్ కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకంపనల తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 7.2గా గుర్తించగా.. అమెరికా జియోలాజికల్ సర్వే దీన్ని 7.4గా పేర్కొంది.
హువాలియెన్ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం, 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా 934 మందికిపైగా గాయపడినట్లు తైవాన్ అధికారులు తెలిపారు. మరొ 50 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సుమారు 70 మంది కార్మికులు రాళ్ల క్వారీలో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ విపత్తు ధాటికి పలు భవనాలు కుప్పకూలగా, మరికొన్ని ఒకవైపునకు ఒరిగాయి. వంతెనలు ఊగిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications