హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ విషయం చెప్పండి! మోడీ-కేసీఆర్‌లతో ఇవాంకా సరదాగా: ఇరుకైన దారి, అతిథులకు చేదు

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆమె మంగళవారం ట్రైడెంట్ హోటల్లో దిగి, అందరితో కలివిడిగా మాట్లాడిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆమె మంగళవారం ట్రైడెంట్ హోటల్లో దిగి, అందరితో కలివిడిగా మాట్లాడిన విషయం తెలిసిందే. సిబ్బందిని, అధికారులను పరిచయం చేస్తున్న సమయంలో ఆత్మీయంగా పలకరించారు.

అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!

Recommended Video

GES 2017 : Media Trolls on ivanka dress

కొందరిని ఆమె పలకరించి మరీ వివరాలు తెలుసుకున్నారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లోను ఇవాంకా సందడి చేశారు. అప్పటికే గ్లోబల్ సమ్మిట్‌లో అన్నీ తానై నిలిచారు. విందులోను అలాగే కనిపించారు.

హైదరాబాద్ బిర్యానీ, టీ అమ్ముకున్న మోడీ, భారత్ మాకు ఆదర్శం: ఇవాంకాహైదరాబాద్ బిర్యానీ, టీ అమ్ముకున్న మోడీ, భారత్ మాకు ఆదర్శం: ఇవాంకా

మోడీ, కేసీఆర్‌లను అడిగి తెలుసుకున్నారు

మోడీ, కేసీఆర్‌లను అడిగి తెలుసుకున్నారు

ఫలక్‌నుమా ప్యాలెస్‌కు సంబంధించిన పలు విషయాలను ప్రధాని నరేంద్ర మోడీని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోను కొన్నిసార్లు మాట్లాడి హైదరాబాద్ విషయాలు తెలుసుకున్నారు. దాదాపు 50 నిమిషాల పాటు ప్యాలెస్‌లోని పలువురితో ఇవాంక ఆప్యాయంగా మాట్లాడారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గందరగోళం

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గందరగోళం

మంగళవారం హెచ్ఐసీసీ నుంచి ఇవాంకా, మోడీ, కేసీఆర్ తదితరులు ఫలక్‌నుమా ప్యాలెస్ వచ్చారు. ఆ తర్వాత అతిథులను బస్సుల్లో తరలించారు. వారు ప్రయాణించే మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు ప్యాలెస్‌లో మాత్రం ఇక్కట్లను తప్పించలేకపోయారు.

అందుకే గందరగోళ పరిస్థితి

అందుకే గందరగోళ పరిస్థితి

దేశ విదేశీ ప్రతినిధులను వోల్వో బస్సుల్లో ప్యాలెస్‌కు చేర్చారు. అక్కడ పార్కింగ్ లేకపోవడంతో ఆ బస్సులను బయటకు పంపించారు. సమీపంలోనే ఉన్న ఆర్టీసీ బస్టాండులో నిలపాలనే ఉద్దేశంతో అలా చేశారు. అయితే కొన్ని కొన్ని బస్సులను పంపించి వేసిన తర్వాత గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్యాలెస్‌ లోపలి నుంచి ప్రధాన రోడ్డుకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

వెయిట్ చేసిన అతిథులు

వెయిట్ చేసిన అతిథులు

అతిథులను లోపల దించి బయటికి వెళ్లే బస్సులకు లోపలికి వెళ్లే బస్సులు ఎదురుపడటంతో తిరిగి వెనక్కి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా అతిథులతో నిండి ఉన్న అయిదు బస్సులను కాసేపు జంగంమెట్‌ ప్రాంతంలో నిలపవలసి వచ్చింది. దీంతో అతిథులు కాసేపు బస్సుల్లో అక్కడే నిరీక్షించవలసి వచ్చింది.

హైదరాబాద్ బిర్యాని ప్రత్యేక ఆకర్షణ

హైదరాబాద్ బిర్యాని ప్రత్యేక ఆకర్షణ

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందులో దాదాపు 200 రకాల వంటకాలను ఉంచారు. హైదరాబాదీ వంటకాలతో పాటు దేశ, విదేశీ వంటలు రూచి చూపించారు. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజాం రాయల్‌ ప్యాలెస్‌ బిర్యానీ, 8 రకాల హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీలు, మేక, పొట్టేలు, ఇటాలియన్‌ వంటకాలు, హైదరాబాద్‌లో ప్రత్యేకమైన పత్తర్‌కా ఘోష్‌తోపాటు హలీం, షీర్‌ కుర్మా, కుర్బానీకా మీఠా వంటకాలు వడ్డించారు. శాఖాహారులకు ప్రత్యేకంగా ఆహారం సిద్ధం చేశారు.

English summary
Opening a global business summit in Hyderabad, US President Donald Trump's daughter Ivanka Trump and Prime Minister Narendra Modi were joined by a robot named Mitra. Hours later, they dined at the city's famous marble Falaknuma Palace, once owned by the Nizams of royals of the region.గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆమె మంగళవారం ట్రైడెంట్ హోటల్లో దిగి, అందరితో కలివిడిగా మాట్లాడిన విషయం తెలిసిందే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X