ఘోరం: రెండు లారీల మధ్య నుజ్జునుజ్జైన కారు, 5గురు మృతి(వీడియో)
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు లారీల మధ్య చిక్కుకుని ఓ కారు నుజ్జునుజ్జు అయిపోయింది.
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో ఆర్మూర్ మండలం ఆలూరు వాసులు లక్ష్మణ్(34), హర్షిత్(18), నందిపేట మండలం వెల్మల్ వాసులు ప్రవీణ్‌కుమార్(32), భరత్(18) నిఖిత(18) ఉన్నారు.
Video Credits : T News
మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 25 ఎం 3175. కాగా, ఈ ప్రమాదంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయింది.
ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలిపారు. ఘటనాస్థలిని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. టిఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఘోర ప్రమాదం
తమ పిల్లల్ని కళాశాలల్లో చేర్పించేందుకు స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులున్నారు.

ఘోర ప్రమాదం
ఈ ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టెకిర్యాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆర్మూర్ మండలం ఆలూర్‌కు చెందిన ఎంసాని లక్ష్మణ్, గందె ప్రవీణ్‌లు స్నేహితులు. వారిద్దరు తమ పిల్లలను ఉన్నత చదువుల నిమిత్తం కళాశాలల్లో చేర్పించేందుకు హైదరాబాద్‌కు బయలు దేరారు.

ఘోర ప్రమాదం
కామారెడ్డికి సమీపంలోకి వచ్చాక..పట్టణంలోకి వెళ్లేందుకు చౌరస్తా వద్ద కారు మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి..హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది.

ఘోర ప్రమాదం
ఈ ప్రమాదంలో కారులో ఉన్న లక్ష్మణ్(40), అతని కొడుకు హర్షవర్దన్ (16), నందిపేట మండలం వెల్మల్‌కు చెందిన గందె ప్రవీణ్ (40), ఆయన కూతురు నిఖిత(17), కొడుకు భరత్(15)లు ప్రాణాలు కోల్పోయారు.

ఘోర ప్రమాదం
లక్ష్మణ్ కొడుకు హర్షవర్దన్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేయగా అతన్ని హైదరాబాద్‌లోని కళాశాలలో చేర్పించేందుకు వెళ్తున్నారు. ప్రవీణ్ కూతురు నిఖిత సైతం ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications