శుభవార్త.. ఇళ్ళు లేనివారికి 5 లక్షలు ఇచ్చేది అప్పుడే !

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పథకంలో ఎవరికి ప్రాధాన్యతనిస్తుంది
, ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారు అనే అంశాల పైన రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.

ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై మంత్రి క్లారిటీ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సొంతగా స్థలం ఉండి ఇల్లు లేదో వారికి తొలి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక రెండవ దశలో స్థలం కూడా లేనివారిని గుర్తించి వారికి స్థలం కేటాయించడంతోపాటుగా ఇళ్ల మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.

5 lakhs are given to the homeless Good news on Indiramma housing scheme

గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక
ఇక రాష్ట్రంలో నవంబర్ 6వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తింపు ప్రారంభమవుతుందని దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇక గ్రామాలలో 15 నుంచి 20 తేదీల మధ్య గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని గుర్తించి జాబితాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. మొత్తం 15 రోజుల్లోనే గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.

వారికి ఇందిరమ్మ ఇళ్ళు లేనట్టే
ఇక రాష్ట్రంలో ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేస్తామని లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కనీసం 400 చదరపు అడుగులు తగ్గకుండా ఇల్లు నిర్మాణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పొందారో వారికి ఈసారి కేటాయింపులు ఉండబోవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

అలా ఉంటేనే ఈ పథకానికి అర్హులు
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఎలాంటి డిజైన్లు నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు . 400 సదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని అలా ఉంటేనే గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఇచ్చే అంశం పైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+