వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాస్టిక్ రైస్ భయం పట్టుకుందా?: ఈ టెస్టులతో మీ డౌట్స్ క్లియర్!..

ఆయిల్ టెస్టు ద్వారా కూడా ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించవచ్చు. ఇందుకోసం వేడి వేడిగా ఉన్న నూనెలో కొన్ని బియ్యపు గింజలను వేసి పరీక్షించాలి. ఆ రైస్ ప్లాస్టిక్ గనుక అయితే నూనె అడుగుభాగంలోకి చేరుకుంటాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నకిలీలను సృష్టించడంలో చైనా వాళ్లను మించినవాళ్లు లేరు. ఏ స్థాయి బ్రాండ్ కైనా నకిలీని సృష్టించి మార్కెట్లో వదిలేయగలరు. చైనా వాళ్లను ఆదర్శంగా తీసుకుంటున్నారో.. మరేమో గానీ మన దేశంలోను నకిలీ దందా రాయుళ్లు తయారయ్యారు. ఏకంగా ప్లాస్టిక్ రైస్‌ను సృష్టించి.. తినే తిండితో చెలగాటమాడుతున్నారు.

<strong>ఏపీలోను ప్లాస్టిక్ రైస్ కలకలం: బంతిలా ఎగురుతున్న అన్నం ముద్ద!..</strong>ఏపీలోను ప్లాస్టిక్ రైస్ కలకలం: బంతిలా ఎగురుతున్న అన్నం ముద్ద!..

అన్నం ముద్ద నోట్లో పెట్టుకుందామంటే భయపడే రీతిలో ఈ దందా రెచ్చిపోతోంది. ఏవి ఒరిజినల్ బియ్యమో.. ఏవి నకిలీవో తెలియక అమాయక జనం ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్ రైస్ తిన్నవారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ రైస్‌ను గుర్తించడమెలా? అన్న ప్రశ్న సహజంగానే ప్రతీ ఒక్కరిలో మెదులుతోంది.

అయితే ప్లాస్టిక్ రైస్ ను గుర్తించడానికి ఏ ల్యాబ్ కో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే రైస్ టెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాటర్ టెస్ట్:

వాటర్ టెస్ట్:

ఒక గ్లాస్ వాట‌ర్ తీసుకుని అందులో బియ్యం గింజ‌ల్ని వేయాలి. ఆపై గ్లాస్ ను బాగా షేక్ చేయాలి. ఇలా షేక్ చేయడం వల్ల ప్లాస్టిక్ బియ్యం పైన తేలి అసలు బియ్యం అడుగుకు వెళ్లిపోతాయి. ఈవిధంగా ప్లాస్టిక్ రైస్ ను గుర్తించవచ్చు.

ఫైర్ టెస్ట్;

ఫైర్ టెస్ట్;

మరో విధానంలో ఫైర్ టెస్టు ద్వారా ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించవచ్చు. బియ్యపు గింజలను అగ్గిపుల్లతో కాల్చినప్పుడు.. ప్లాస్టిక్ వాసన గనుక వస్తే.. ఆ బియ్యం ప్లాస్టిక్ అని నిర్దారించవచ్చు. లేనిపక్షంలో అవి మామూలు రైస్ కింద లెక్క.

బాయిలింగ్ టెస్టు:

బాయిలింగ్ టెస్టు:

బియ్యాన్ని అన్నంలా వండి రెండు మూడు రోజులు నిల్వ చేయాలి. ఒకవేళ బియ్యం ప్లాస్టిక్ అయితే మూడు రోజులు కాదు నాలుగు రోజులు నిల్వ ఉన్న పాడవదు. ఎందుకంటే , ప్లాస్టిక్‌కు ఎటువంటి ఫంగస్ సోకదు. ఎటువంటి వాతావరణంలోనైనా ఎన్ని రోజులైనా అది ప్లాస్టిక్ లాగే ఉంటుంది. అదే అసలైన బియ్యం అయితే ఒకరోజుకే ఫంగస్ చేరి పాడైపోతుంది.

ఆయిల్ టెస్టు:

ఆయిల్ టెస్టు:

ఆయిల్ టెస్టు ద్వారా కూడా ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించవచ్చు. ఇందుకోసం వేడి వేడిగా ఉన్న నూనెలో కొన్ని బియ్యపు గింజలను వేసి పరీక్షించాలి. ఆ రైస్ ప్లాస్టిక్ గనుక అయితే నూనె అడుగుభాగంలోకి చేరుకుంటాయి.

అన్నం వండేప్పుడు గుర్తించవచ్చు:

అన్నం వండేప్పుడు గుర్తించవచ్చు:

అన్నం వండేటప్పుడు కూడా ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించవచ్చు. వండుతున్న అన్నం ప్లాస్టిక్ గనుక అయి ఉంటే, ఆ పాత్ర పైన చిక్కని ద్రవం లాగా పేరుకుపోతుంది.

English summary
Since last three days Plastic Rice has created the fear factor in Hyderabad. Hotel in Saroornagar served biryani made of plastic rice, then after many cases came up with a similar complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X