జనహిత కిడ్నాప్ కాలేదు.. మరో స్కూల్ బస్సులో ఎక్కింది
బాచుపల్లి ప్లే స్కూల్‌లో చదువుతున్న అయిదేళ్ల చిన్నారి జనహిత కిడ్నాప్‌కు బుధవారం ఉదయం గురైనట్లుగా వార్తలు వచ్చాయి. స్కూల్‌కు వెళ్లేందుకు జనహిత బస్సు కోసం వేచి చూస్తుండగా..
హైదరాబాద్: బాచుపల్లి ప్లే స్కూల్‌లో చదువుతున్న అయిదేళ్ల చిన్నారి జనహిత కిడ్నాప్‌కు బుధవారం ఉదయం గురైనట్లుగా వార్తలు వచ్చాయి. స్కూల్‌కు వెళ్లేందుకు జనహిత బస్సు కోసం వేచి చూస్తుండగా.. అప్పుడే వచ్చిన మరో బస్సులో ఆమెను ఎత్తుకు పోయినట్లుగా ప్రచారం జరిగింది.
స్కూల్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. జనహిత స్థానికంగా ఓ ప్లే స్కూల్‌లో చదువుతోంది. బుధవారం ఉదయం ఆమె స్కూల్ బస్సు కోసం రోడ్డు పక్కన వేచి చూస్తోంది.
ఆ అమ్మాయి స్కూల్ బస్సు రాలేదు. కానీ మరో బస్సు వచ్చింది. బస్సులో అప్పటికే మరికొందరు చిన్నారులు ఉన్నారు. దీంతో ఆ చిన్నారి ఆ బస్సులో ఎక్కింది.

ఆ తర్వాత ఆ చిన్నారి స్కూల్ బస్సు వచ్చింది. దీంతో కిడ్నాప్‌కు గురైనట్లుగా భావించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.కిడ్నాప్ కాదు.. పొరపాటున జరిగింది
ఆ తర్వాత కాసేపటికే జనహిత ఆచూకి లభ్యమైంది. చిన్నారి జనహితను తన స్కూల్ బస్సు ఎక్కలేదు. పొరపాటున ఆ చిన్నారిని మరో స్కూల్ బస్సు వాళ్లు ఎక్కించుకున్నారు. దీంతో కిడ్నాప్‌కు గురైనట్లుగా కలకలం చెలరేగింది. ఆ తర్వాత ఆమె మరో బస్సులో ఎక్కినట్లు గుర్తించారు. కిడ్నాప్‌కు గురి కాలేదని తేలింది.












Click it and Unblock the Notifications