తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి...

తెలంగాణలో కొత్తగా 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 288 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం (నవంబర్ 16) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

    Telangana : కరోనా నెగటివ్ వచ్చినా క్వారంటైన్ లోనే ఉండాలి.. చిరు కి తెలంగాణ సర్కార్ సూచన!

    తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1407కి చేరింది. ప్రస్తుతం 14,385 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 11,948 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 1539 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,42,084కి చేరింది.

    502 new coronavirus cases and 3 deaths reported from telangana

    గడిచిన 24గంటల్లో మొత్తం 17,296 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 48,91,729కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,31,427 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 93.2శాతం ఉండగా తెలంగాణలో 93.87శాతం ఉన్నట్లు తెలిపారు.

    తాజాగా నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 141, రంగారెడ్డి జిల్లాలో 72,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 33 సంగారెడ్డి జిల్లాలో 26 కేసులు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+