కరోనా అప్‌డేట్... తెలంగాణలో కొత్తగా 509 కేసులు.. మరో ముగ్గురు మృతి...

తెలంగాణలో కొత్తగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 717 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (డిసెంబర్ 17) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,644కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1505కి చేరింది. ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5,063 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 517 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,70,967కి చేరింది.

గడిచిన 24గంటల్లో మొత్తం 48,652 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 63,06,397కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,69,435 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.2 శాతం ఉండగా తెలంగాణలో 96.89శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 104, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 45, రంగారెడ్డి జిల్లాలో 42 కేసులు ఉన్నాయి.

509 new coronavirus cases and 3 deaths reported from telangana

దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 24,010 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. గత 24 గంటల్లో 33,291 మంది కోలుకున్నారు.మరో 387 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,44,096కి చేరగా ప్రస్తుతం 3,32,002 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

గడచిన 24 గంట‌ల సమయంలో 355 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,44,451కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,89,740 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 15,78,05,240 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+