Corona: హైదరాబాదీలు బీ అలర్ట్ - కోవిడ్ మరోసారి పంజా, తాజా కేసులతో...!
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ వచ్చింది. 54 కేసుల్లో 40 కేసులు హైదరాబాద్ పరిధిలో వచ్చాయి. మంగళవారం 52 కేసులు నమోదు కాగా 30 కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. కొవిడ్ పాజిటివ్ రేటు 1.09గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇన్‌ఫ్లూయెంజా
రాష్ట్రంలో ప్లూ లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా పెరుగుతన్నారు. మరోవైపు దేశాన్ని ఇన్‌ఫ్లూయెంజా కేసులు వణికిస్తున్నాయి. తుమ్ములు, దగ్గడం, తుంపర్లు పడటం, కలుషితమైన ఉపరితలాలతో (ఫోమైట్స్) ద్వారా ఫ్లూ వ్యాప్తి చెందుతాయి. కొన్ని సందర్భాల్లో, అవి సోకిన వ్యక్తుల మలం ద్వారా కూడా వ్యాప్తి జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

500 కంటే ఎక్కువ కేసులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మళ్లీ కరోనా కేసులు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ 19 పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండడాన్ని గుర్తించిన కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఏడు రోజుల సగటు తాజా కేసులు 500 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

గుజరాత్
గుజరాత్ లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందతుంది. గుజరాత్ తర్వాత కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర, తమిళనాడులో నమోదు అవుతన్నాయి. కరోనా, ఇన్‌ఫ్లూయెంజా కేసులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు కరోనా,
ఇన్‌ఫ్లూయెంజా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications