కానుకలు: ఖైరతాబాద్ గణనాథుడికి 580 కిలోల లడ్డూ ..ముంబై విఘ్నేశ్వరుడికి 70 కిలోల బంగారం
వినాయక చవితి సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. దేశవ్యాప్తంగా గణనాథుడు పూజల అందుకుంటున్నాడు. భక్తులు తమకు తగ్గట్టుగా వినాయకుడికి కానుకలు బహుకరిస్తున్నారు. కొందరు భారీగా మిఠాయిలు సమర్పిస్తుంటే... మరికొందరు గణనాథుడిని బంగారంతో నింపేస్తున్నారు. ఇక చాలా చోట్ల వినాయకుడు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. వివిధ ఆకారాల్లో ఉన్న లంబోదరుడిని చూసి భక్తుల పరవశించిపోతున్నారు. తమ కోరికలు తీర్చాల్సిందిగా పూజలు చేస్తున్నారు.

ఖైరతాబాద్ వినాయకుడికి 580కిలోల లడ్డూ ప్రదానం
సాధారణంగా విఘ్నేశ్వరుడు అంటే ఐశ్వర్యానికి ప్రతీక. ఆయనకు కుడుములంటే చాలా ఇష్టం. అది చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. కేవలం ఈ కుడుములను ప్రసాదంగా తీసుకునేందుకే భక్తులు వినాయకుని మంటపాల దగ్గర భారీ క్యూలైన్లలో నిల్చుంటారు. ఈ కుడుము ప్రసాదంగా తీసుకున్న తర్వతే బయటకొస్తారు. అంతేకాదు అదేసమయంలో భారీగా కానుకలు కూడా సమర్పిస్తారు. ఇలాంటి భక్తుడే ఆంధ్రప్రదేశ్‌లో ఒకరున్నారు. ఆయన పేరు పీవీవీ మల్లిఖార్జున రావు. ఆయన గణనాథుడికి ఏకంగా 580 కిలోల భారీ లడ్డును బహూకరించాడు.

లడ్డూ కోసం వినియోగించిన పదార్థాలు
మహాప్రసాదంగా పిలవబడుతున్న లడ్డూను ఖైరతాబాద్ గణనాథుడికి ప్రసాదంగా ఇచ్చాడు. పూజ అయ్యాక లడ్డూను భక్తులకు పంచుతారు. ఈ భారీ లడ్డూను తయారు చేసేందుకు 220 కిలోల చక్కెర, 145 కిలోల ఆవు నెయ్యి, 175 కిలోల బెంగాల్ గ్రామ్, 25 కిలోల జీడిపప్పు, 13 కిలోల బాదంపప్పు, 3కిలోల యాలకలు, ఒక కిలో కర్పూరం వినియోగించి ఈ లడ్డు తయారు చేశారు.

ముంబై గణనాథుడికి 70 కిలోల బంగారం
ఇక ముంబైలో మరో భక్తుడు గణనాథుడికి 70 కిలోల 23 క్యారట్ బంగారాన్ని కానుకగా సమర్పించారు. ఆయన ముంబైలోని తూర్పు సియోన్ ప్రాంతంలో ఏర్పాటైన గణనాథుడికి ఈ బంగారాన్ని సమర్పించాడు. అక్కడ డ్రోన్ కెమెరాలతో భారీ నిఘాను ఏర్పాటు చేశారు. గణేష్ ఉత్సవాలు గణేష్ చతుర్థిన ప్రారంభమై పది రోజుల తర్వాత అంటే అనంత్ చతుర్దశి రోజున ముగుస్తాయి. ఈ రోజున లంబోదరుడిని నీళ్లలో నిమజ్జనం చేస్తారు.

ఒక్క ముంబైలోనే నిమజ్జనం కానున్న 1,50,000 విగ్రహాలు
గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు కొత్త బట్టలు ధరించి, మిఠాయిలు పంచుకుంటారు. అంతేకాదు వీధుల్లో నాట్యాలు చేస్తూ సంబరంగా గడుపుతారు. గణేషుడి వద్ద ఉంచిన కుడుములు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు భారీగా జరుగుతాయి. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశాయి ఆయా రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం. ఒక్క ముంబై నగరంలోనే ఏటా 1,50,00 విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.












Click it and Unblock the Notifications