తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు: 8వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోసారి హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,07,472 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు, 2 మరణాలు

తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు, 2 మరణాలు


తాజాగా, నమోదైన 591 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,45,997కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3807కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1154 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 8,819 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 8,819 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 643 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,33,371కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,819 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.04 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

Recommended Video

    Delta Variant Spreads From Nanjing to Beijing In China | Oneindia Telugu
    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు


    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 14, జీహెచ్ఎంసీలో 68. జగిత్యాలలో 31, జనగామలో 11, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 04, కరీంనగర్‌లో 75, ఖమ్మంలో 58, కొమురంభీం ఆసిఫాబాద్ లో 03, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 12, మంచిర్యాలలో 21, మెదక్‌లో 03, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 30, ములుగులో 07, నాగర్ కర్నూలులో 05, నల్గొండలో 31, నారాయణపేటలో 03, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 05, పెద్దపల్లిలో 32, రాజన్న సిరిసిల్లలో 21, రంగారెడ్డిలో 20, సంగారెడ్డిలో 05, సిద్దిపేటలో 12, సూర్యాపేటలో 23, వికారాబాద్ లో 02, వనపర్తిలో 05, వరంగల్ రూరల్‌లో 12, వరంగల్ అర్బన్‌లో 51, యాదాద్రి భువనగిరిలో 11 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+