మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: మృతి చెందిన ఆరుగురు వీరే (ఫోటోలు)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ పారిశ్రామికవాడలోని హసిత ఆరోమేటిక్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలోని హసిత ఆరోమెటిక్ రసాయన పరిశ్రమలో మిక్సింగ్ ప్రొడక్షన్ యూనిట్‌లో పేలుడు ధాటికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యనారాణమూర్తి(45), వెంకటేశ్వర్‌రావు(28), ఛత్తీసగఢ్‌కు చెందిన కోసారాం(31), దేవరాం(25), దాసురాం(25), జోగారాం(24) అక్కడికక్కడే మృతి చెందారు.

మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
మరో కార్మికుడు సునీల్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు ఎల్‌బీనగర్ డీసీసీ, ఇబ్రహీంపట్నం ఏసీపీ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
వీరితో పాటు జేసీ రజిత్ కుమార్ సైనీ, ఆర్డీఓ సుధాకర్, తహశీల్దార్ గోపీరాం పరిశ్రమలో సిబ్బందిని పేలుడుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉండటంతో, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.

మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా హుటాహుటి ప్రమాదస్థలి వద్దకు వచ్చారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆరుగురు కార్మికులు మృతి చెందారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
ఎలాంటి అనుమతులూ లేకుండా పరిశ్రమలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన తర్వాతే మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించాలని సీపీఐ(ఎం), బీజేపీ నాయకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మహేశ్వరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
అధికారులు, ప్రజాప్రతినిధులు కంపెనీ యాజమాన్యంతో చర్చించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం చెల్లించడానికి ఒప్పించారు.












Click it and Unblock the Notifications