భూపాలపల్లి జిల్లాలో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు అడవుల్లో శుక్రవారం నాడు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
సంఘటనాస్థలంలో మావోయిస్టులకు గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొంటున్నాయని పోలీసులు తెలిపారు.
భూపాలపల్లి జిల్లా వాజేడు సమీపంలోని మర్రిమల్ల, అన్నారం, మద్దెడు, వెంకటాపురం ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మావోలకు గ్రేహౌండ్స్ దళాలకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి.

ఈ ఘటనలో సుమారు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృత్తులో ఇద్దరు ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికి చెందినవారు కాగా, మిగిలిన నలుగురు తెలంగాణ ప్రాంతానికి చెందినవారుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొంటున్నాయి.
2018 మార్చి 2 వ తేదిన ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత తాజాగా ఇదే జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications