Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Virat Kohli: గోడపై 60 అడుగుల విరాట్ కోహ్లీ పెయింటింగ్.. అభిమానం చాటుకున్న ఖమ్మం యువకుడు..

ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లో క్రికెట్ ను ఒక మతంగా కొలుస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాదాపు అందరికీ క్రికెట్ గురించి తెలుసుంటుంది. క్రికెట్ పై అభిమానమే కాదు.. క్రికెట్ ఆడే అటగాళ్లపై కూడా విపరీతమైన అభిమానం ఉంటుంది. ఒక్కప్పుడు సచిన్ అంటే చాలా మంది ఇష్టపడే వారు. ఆ తర్వాత ఆ స్థాయిలో విరాట్ కోహ్లీ అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు.

కోహ్లీపై అభిమానంతో కొందరు తమ ఒంటిపై కోహ్లీ చిత్రాన్ని టాట్ గా వేసుకున్నారు. తాజాగా ఖమ్మంకు చెందిన విరాట్ కోహ్లీ వీర అభిమాని కోహ్లీ భారీ పెయింటింగ్ ను గోడపై వేయించారు. కార్తికేయ అనే యువకుడు గోడపై 60 అడుగుల విరాట్ కోహ్లీ పెయింటింగ్ వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెయింటింగ్ పోస్టులకు చాలా మంది కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తమ దేవుడంటూ కామెంట్ చేస్తున్నారు.

60 feet virat kohli painting on wall in khammam

గత ఏడాది విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లో 50 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటుచేశారు. విరాట్ కోహ్లీ క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 108 టెస్ట్ మ్యాచులు ఆడి 8,416 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 274 వన్డేల్లో విరాట్ కోహ్లీ 12,898 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

115 టీట్వింటీలు ఆడిన కోహ్లీ 4,008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 పరుగులు కాగా, వన్డేల్లో 183, టీట్వింటీల్లో 122 పరుగులు చేశాడు. వన్డేల్లో, టీట్వింటీల్లో నాలుగ చొప్పున వికెట్లు తీశాడు. సచిన్ తర్వాత భారత్ తరుఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+