హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అపశ్రుతి చోటు చేసుకుంది. యోగా సాధన చేసిన కొద్దిసేపటికే ఓ ఆయుర్వేద విశ్రాంత వైద్యుడు మృతి చెందాడు. ముక్కు రంధ్రంలో నీళ్లు పోసుకొని, శ్వాస తీసే ప్రయత్నంలో నీరంతా గుండెలోకి చేరడంతో శ్వాస ఆడక మృతి చెందాడు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిలువూరి వీరారెడ్డి (61) కార్వాన్ లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసి ఏడాకి క్రితం రిటైరయ్యారు. వృత్తి రీత్యా ఆయుర్వేద డాక్టరైన ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం, గోవర్ధనగిరి గ్రామం.

భార్య సౌభాగ్యలక్ష్మీ గృహిణి. కుమారుడు సాయినందన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఎంటెక్ చదువుతున్న కూతురు సాహితితో కలిసి సహార స్టేట్స్‌కాలనీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు సహార స్టేట్స్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి

యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి


ఇందులో పాల్గొనేందుకు వీరారెడ్డి ఎంతో ఉల్లాసంగా వెళ్లారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో పలు ఆసనాలను చేసిన ఆయన.. తాను స్వయంగా కొన్ని యోగా ట్రిక్స్‌ను చేసి చూపుతానన్నారు. మంచినీటిని ముక్కులోని ఒక రంధ్రంలోకి వదిలి మరో రంధ్రం నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశాడు.

 యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి

యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి


లోపలికి వెళ్లిన నీరు బయటకి రాకుండా గుండెల్లోకి చేరడంతో శ్వాస అందక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచరులు వెనువెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వీరారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుమారు ఐదు నెలల కిందట గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వీరారెడ్డికి ఇటీవలే డాక్టర్లు రెండు స్టంట్స్ వేసినట్లు ఆయన మిత్రులు తెలిపారు.

 యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి

యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి

సుమారు 1400 కుటుంబాలు నివాసముండే సహార స్టేట్స్‌కాలనీలో వీరారెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయుర్వేద డాక్టర్‌గా అనుభవజ్ఞుడైన ఆయన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యానందిస్తూ సలహాలు, సూచనలు చేసేవారు. అందరికి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెప్పడమే కాదు.

యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి

యోగాలో అపశ్రుతి: విశ్రాంత వైద్యుడు మృతి

వీరారెడ్డి తన ఆరోగ్యం పట్ల అంతే జాగ్రత్తగా ఉండేవారు. క్రమం తప్పకుండా కాలనీలోని పెద్ద పార్కులో మార్నింగ్ వాక్ చేస్తూ.. అందరితో కలివిడిగా ఉండే తమ మిత్రుడు ఇక లేరన్న విషయం కాలనీవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఉల్లాసంగా వెళ్లిన వీరారెడ్డి విగతజీవుడై ఇంటికి రావడం చూసిన ఆయన కుటుంబసభ్యులు బోరున విలపించారు.

English summary
International Yoga day is turned fatal among a retired Ayurveda doctor in Hyderabad today. A 61-year-old retired Ayurveda doctor is dead while practicing yoga as part of International yoga day after complaining chest pain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X