తెలంగాణలో కొత్తగా 614 కరోనా కేసులు: ఆ జిల్లాలో 4 రోజులుగా ఒక్క కేసూ లేదు, జిల్లాలవారీగా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,11,251 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు
తాజాగా, నమోదైన 614 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,44,330కు చేరింది. కరోనాతో కొత్తగా నలుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3800కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1950 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 9,141 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 657 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,31,389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.99 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
Recommended Video

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 06, భద్రాద్రి కొత్తగూడెంలో 18, జీహెచ్ఎంసీలో 73. జగిత్యాలలో 37, జనగామలో 12, జయశంకర్ భూపాలపల్లిలో 05, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 61, ఖమ్మంలో 47, కొమురంభీం ఆసిఫాబాద్ లో 04, మహబూబ్‌నగర్‌లో 08, మహబూబాబాద్‌లో 10, మంచిర్యాలలో 17, మెదక్‌లో 03, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 33, ములుగులో 05, నాగర్ కర్నూలులో 06, నల్గొండలో 45, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 06, పెద్దపల్లిలో 32, రాజన్న సిరిసిల్లలో 21, రంగారెడ్డిలో 30, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 15, సూర్యాపేటలో 22, వికారాబాద్ లో 04, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 11, వరంగల్ అర్బన్‌లో 59, యాదాద్రి భువనగిరిలో 11 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, నారాయణపేట్ జిల్లాలో వరుసగా నాలుగోరోజు కూడా ఒక్క కొత్త కరోనా కేసూ నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications