కరోనా అప్‌డేట్... తెలంగాణలో కొత్తగా 627 కేసులు.. మరో నలుగురు మృతి...
తెలంగాణలో కొత్తగా 627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 669 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం (డిసెంబర్ 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,822కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1510కి చేరింది. ప్రస్తుతం 6942 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 4814 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 721 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,72,370కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 46,694 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 64,01,082కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,71,979 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు.

జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.2 శాతం ఉండగా తెలంగాణలో 96.99శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 123, రంగారెడ్డి జిల్లాలో 52,మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 48 కేసులు ఉన్నాయి.
శుక్రవారం(డిసెంబర్ 18) నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99.79లక్షలకు చేరింది. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 95లక్షలకు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,44,789కి చేరింది.












Click it and Unblock the Notifications